Breaking News

Nivetha Thomas: పవన్ కళ్యాణ్ హీరోయిన్ నివేథా థామస్ రేర్ ఫీట్... మెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్, డైరెక్టర్ సుధీర్ వర్మ


సినిమాల్లో కాదు.. నిజ జీవితంలో సాహ‌సాలు చేసేవాళ్లు, ఇత‌రుల‌కు సాయ‌ప‌డేవాళ్ల‌ని రియ‌ల్ హీరోలంటాం. మ‌రి వెండితెర‌పై మ‌న మ‌న‌సుల‌ను దోచుకున్న స్టార్స్ అలాంటి రియ‌ల్ సాహసాలు చేస్తే ఇంకేమనాలి. అభిమానులు సంతోషం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలా? ఇప్పుడు నివేథా థామ‌స్‌ను చూసి ఆమె అభిమానులు అలాంటి సంతోష క్ష‌ణాల‌ను అనుభ‌విస్తున్నారు. ఇంత‌కీ ఈ సుంద‌రాంగి ఏం చేసింద‌నేగా.. చిన్నా చిత‌క విష‌యం మాత్రం కాదు.. అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. ఆఫ్రికా ఖండంలోనే అత్యంత పెద్దదైన ప‌ర్వ‌త శిఖ‌రం కిలిమంజారోని నివేథా థామ‌స్ అధిరోహించింది. ఈ విష‌యాన్ని ఆమె త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ ట్వీట్ చేసింది. దీంతో నెటిజ‌న్స్ నివేథా థామ‌స్‌ను పొగడ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. ఈ కిలోమంజారో ప‌ర్వ‌తాన్ని ఎక్క‌డానికి నివేథా థామ‌స్ దాదాపు ఆరు నెల‌ల పాటు క‌ఠోర‌మైన శిక్ష‌ణ తీసుకుంది. హీరోయిన్‌గా బిజీ షెడ్యూల్‌లో ఉన్న‌ప్ప‌టికీ 19340 అడుగులున్న ఈ ప‌ర్వ‌తాన్ని ఎక్కేట‌ప్పుడు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ట్రైనింగ్ తీసుకుని చేయ‌డం చాలా గొప్ప విష‌యమ‌ని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. నివేథ ఫోటోల‌ను షేర్ చేసిన‌ప్పుడు హీరో, డైరెక్ట‌ర్ రాహుల్ ర‌వీంద్ర‌న్ చాలా గొప్ప విష‌యాన్ని సాధించావు అని అభినందించ‌గా, మ‌రో డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ‌.. నువ్వు అంత పెద్ద ప‌ర్వ‌తాన్ని ఎక్కావు. నేను ఇక్క‌డున్న గొల్కొండ‌ను ఇంత వ‌ర‌కు ఎక్క‌లేదు అంటూ ఆమెకు ఓ తనదైన స్టైల్లో రిప్ల‌య్ ఇచ్చారు. వారిద్ద‌రికీ నివేథా థామ‌స్ థాంక్స్ చెప్పింది. సాహ‌సాలు చేయ‌డానికి ఇష్ట‌ప‌డే నివేథా థామ‌స్ కిలిమంజారోనే అధిరోహించాల‌ని చాలా రోజుల నుంచి అనుకున్నంది. ఎట్ట‌కేల‌కు ఆమె క‌ల నేర‌వేరింద‌ని నెటిజ‌న్స్ ఆమెకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ ఇప్ప‌టి వ‌ర‌కు ద‌క్షిణాది సినిమాలైన తెలుగు, మ‌ల‌యాళం, త‌మిళ చిత్రాల్లోనే న‌టించింది. తెలుగు ప్రేక్ష‌కుల‌ను నాని హీరోగా చేసిన నిన్నుకోరి సినిమాతో ముందుగా ప‌ల‌క‌రించింది. ఆ త‌ర్వాత జెంటిల్‌మ‌న్ సినిమాలోనూ మ‌రోసాని నానితో జోడీ క‌ట్టింది. రీసెంట్‌గా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ టైటిల్ రోల్ చేసిన ‘వ‌కీల్ సాబ్‌’లో ఓ కీల‌క‌మైన పాత్ర‌ను ఆమె పోషించింది. అలాగే నాని నిర్మాణంలో ఆయ‌న సోద‌రి దీప్తి గంటా తెర‌కెక్కిస్తోన్న మీట్ క్యూట్‌లోనూ ఓ హీరోయిన్‌గా మెప్పించ‌నుంది. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న శాకిని డాకిని అనే సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్‌లో ఓ హీరోయిన్‌గా ఆక‌ట్టుకోనుంది నివేథా థామ‌స్‌. ఇలా గ్లామ‌ర్ షోల‌కు దూరంగా ఉంటూ కేవ‌లం పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాల‌కు మాత్ర‌మే నివేథా థామ‌స్ ఓటు వేస్తూ ఈ నేచుర‌ల్ బ్యూటీ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ స్థానాన్ని ద‌క్కించుకుంది.


By October 24, 2021 at 08:20AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nivetha-thomas-climbed-mount-kilimanjaro-and-shared-photos/articleshow/87233399.cms

No comments