Naresh - MAA elections: ‘మా’లో ముఠా నాయకుడు ఎవరో చెప్పిన నరేశ్..ముదురుతున్న వివాదాలు
అక్టోబర్ 10న జరగబోతున్నాయి. ఎలక్షన్స్‌లో పోటీ పడుతున్న ప్యానెల్ సభ్యులు ఒకరిపై ఒకరు పదునైన విమర్శలు చేసుకుంటున్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లో జనరల్ సెక్రటరీగా పోటీ పడుతున్న జీవిత, మాజీ అధ్యక్షుడు నరేశ్‌ను ఉద్దేశించి ఆయన చేసిన విమర్శలకు సమాధానం ఇచ్చారు. దీనికి బదులుగా వి.కె.నరేశ్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. గతంలో ఓ ముఠా నాయకుడు కారణంగానే ‘మా’ సభ్యుల్లో గొడవలు మొదలైందని నరేశ్ చెప్పారు. అసలు ఆ ముఠా నాయకుడెవరు? అని అడిగిన ప్రశ్నకు నరేశ్ సమాధానమిచ్చారు. ‘‘75 ఏళ్లు పూర్తి చేసుకున్న ఓ ఆర్గనైజేషన్ ఈవెంట్‌లో భాగంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘మా’ అసోసియేషన్ ఏదో చేయాలనుకుంది. ఆరోజు నేను షూటింగ్‌లో ఉన్నప్పుడు తొమ్మిదిన్నరకు జీవిత ఫోన్ చేసి పది లక్షలు ఇవ్వాలనుకుంటున్నామని జీవిత ఫోన్ చేశారు. అదెవరి డబ్బు..నీదో నాదో కాదు.. అసోసియేషన్ డబ్బు. ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టడానికి కనీసం మూడు రోజులు సమయం కావాలి. కానీ అలాంటిదేమీ లేకుండా పొద్దున ఫోన్ చేసి అనుకుని పన్నెండు గంటలకు మీటింగ్ పెట్టుకుని, సాయంత్రం నాలుగున్నర గంటలకు చెక్ ఇవ్వాలంటారు. జనరల్ సెక్రటరీతో పాటు ప్రెసిడెంట్ నేను, ట్రెజరర్ రాజీవ్ కనకాల సంతకం పెట్టకుండా చెక్ ఎవరు ఇచ్చారు. బ్లాంక్ కవర్ ఇచ్చారు. ఒకవేల నిజంగా చెక్ ఇచ్చుంటే చెక్ నెంబర్ చెప్పమనండి నిజమేంటో తెలుస్తుంది. రాజశేఖర్‌గారికి ప్రెసిడెంట్ కావాలనే కోరిక ఉండేది. దాన్ని ఓ ముఠా ఎంకరేజ్ చేసింది. వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న బెనర్జీ, అమెరికాలో ట్రిప్‌కు మా సభ్యులు వెళ్లి ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోటి రూపాయలు సంపాదించుకుని వచ్చారు. ఎవరైనా కోటి రూపాయల కోసం ఆరు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తారా? అని నేను సీరియస్ అయ్యాను. అక్కడ నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి. నేను పోటీ చేసినప్పుడు బెనర్జీ వైస్ ప్రెసిడెంట్‌గా గెలవలేదు. ఎస్.వి.కృష్ణారెడ్డిగారితో సమానంగా ఓట్లు వచ్చాయి. బెనర్జీ ఓ బ్యాచ్‌ను తయారుచేసుకుని ముఠా నాయకుడిగా వ్యవహరిస్తూ వచ్చారు. వీళ్లు రాజశేఖర్‌ను ప్రభావితం చేసి, నన్ను దింపేసి తనను ప్రెసిడెంట్ చేద్దామన్నారు. అలా గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆ గొడవలు తర్వాత క్రమశిక్షణా సంఘం ఏర్పడింది. రాజశేఖర్‌ను ఎవరూ సస్పెండ్ చేయలేదు. ఆయనే రాజీనామా లెటర్ ఇస్తే, సదరు కమిటీ ఒప్పుకుంది. నిజానికి మా డైరీ ఆవిష్కరణ జరగకూడదనేది వారి ప్లాన్’’ అని నరేశ్ తెలిపారు.
By October 05, 2021 at 09:47AM
No comments