Breaking News

Naga Chaitanya - Samantha: విడాకుల‌కు బాలీవుడ్ స్టారే కార‌ణం.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన కంగనా రనౌత్


అక్కినేని , విడిపోతున్నానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో క్యూట్ క‌పుల్‌గా పేరున్న వీరిద్ద‌రూ విడిపోవ‌డంపై ఎంటైర్ సినీ ఇండ‌స్ట్రీస్ ఆశ్చ‌ర్య‌పోయాయి. అయితే ఎంతో ఆనోన్యంగా ఉంటూ వ‌చ్చిన ఈ జంట ఎందుకు విడిపోయారు? అనేది అంద‌రికీ అర్థం కానీ ప్ర‌శ్నే. అయితే ఈ వ్య‌వ‌హారంపై బాలీవుడ్ కాంట్ర‌వ‌ర్సియ‌ల్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ త‌న‌దైన శైలిలో స్పందించారు. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. చైత‌న్య‌, స‌మంత విడిపోవ‌డంపై కంగ‌నా ర‌నౌత్ మాట్లాడారు. నాగ‌చైత‌న్య చేసిన త‌ప్పిదం కార‌ణంగానే వారిద్ద‌రూ విడిపోవాల్సి వ‌చ్చిందన్నారు. ‘‘ఏదైనా జంట విడిపోయి విడాకులు తీసుకున్నారంటే అందులో ప్ర‌ధానంగా మ‌గాడిదే త‌ప్పంటూ తెలిపారు. ‘‘నేను సనాతంగా మాట్లాడుతున్నాననుకోవచ్చు లేదా ఏదైనా జ‌డ్జిమెంట్ చెబుతున్నాన‌ని అనుకోవ‌చ్చు. దేవుడు మ‌గ‌వాడిని, స్త్రీ త‌యారు చేశాడు. వారి స్వ‌భావాలు ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లు మారుతుంటాయి. అయితే మ‌గ‌వాడు వేట‌గాడిలా ప్ర‌వ‌ర్తిస్తుంటాడు. అమ్మాయిల‌ను విప్పి పారేసే బ‌ట్ట‌లులాగా భావించే ఆలోచ‌న‌ల‌ను మానేయండి. వారికి మంచి స్నేహితుల్లాగా ఉండండి. వంద‌ల మందిలో ఓ స్త్రీ త‌ప్పుగా ఉండ‌వ‌చ్చునేమో. ఇలాంటి త‌ప్పుడు ఆలోచ‌న‌లకు మీడియా, ఫ్యాన్స్ నుంచి ఎంక‌రేజ్‌మెంట్ దొరుకుతుంది. వారు ఓ స్త్రీని త‌మ కోణంలో అంచ‌నా వేసేస్తారు. ఇది వ‌ర‌కు ఎన్న‌డూ లేనంత‌గా విడాకుల సంస్కృతి పెరిగిపోయింది. ఓ బాలీవుడ్ స్టార్ కార‌ణంగానే ఓ ద‌క్షిణాది న‌టుడు విడాకులు తీసుకున్నారు. నాలుగేళ్ల వివాహ బంధం, అంత‌కు ముందు ద‌శాబ్దంకు పైగా అనుబంధం కొన‌సాగించారు. అయితే స‌ద‌రు ద‌క్షిణాది న‌టుడు ఇటీవ‌ల ఉత్త‌రాది స్టార్‌తో ప‌రిచ‌యం పెంచుకున్నాడు. ఆ ఉత్త‌రాది స్టార్ విడాకులు తీసుకోవ‌డం నిపుణుడిగా పేరు పొందాడు. అత‌ని కార‌ణంగా చాలా మంది మ‌హిళ‌లు, పిల్ల‌లు జీవితాలు పాడ‌య్యాయి.


By October 03, 2021 at 11:14AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kangana-ranaut-comments-on-naga-chaitanya-samantha-divorces-and-targeted-bollywood-star/articleshow/86723184.cms

No comments