Breaking News

MAA సమరంలో 'మంచు' శిఖరం.. విజయం వరించాక విష్ణు కంటతడి! ప్రకాష్ రాజ్ సింగిల్ లైన్ కామెంట్


గత రెండు నెలలుగా సినీ వర్గాల్లో హాట్ ఇష్యూగా మారిన 'మా' సమరానికి నిన్న (అక్టోబర్ 10) ఫుల్‌స్టాప్ పడింది. , మధ్య నడిచిన రసవత్తర పోరులో 'మంచు' వారసుడికే అధ్యక్ష పీఠం దక్కింది. 107 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి ప్రకాష్ రాజ్‌ని ఓడించారు విష్ణు. మంచు విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాష్ రాజ్‌కి 274 ఓట్లు పడ్డాయి. అయితే ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయ కేతనం ఎగురవేశారని ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ ప్రకటించగానే విష్ణు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అందరి మధ్యే కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎమోషనల్ అవుతూ ఆయన మాట్లాడారు. ''మనది ఒకటే కుటుంబం. ప్రకాశ్‌రాజ్‌గారు అంటే నాకు చాలా ఇష్టం. నరేష్ గారికి, సపోర్ట్‌ చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఆ ప్యానల్, ఈ ప్యానల్‌ అనేది లేదు. మేం అందరం ఒకటే కుటుంబం. అంతా కలిసే పనిచేస్తాం. రెండు నెలలుగా నరకం అనుభవిస్తున్న ఫీలింగ్‌ కలిగింది. ‘మా’ లో ఇలాంటి పరిణామాలు ఇంకెప్పుడూ జరగకూడదు'' అన్నారు మంచు విష్ణు. ఇదే సమయంలో ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవుతూ సింగిల్ లైన్ కామెంట్ చేశారు. ''తెలుగు బిడ్డ గెలిచాడు. ఈ ఎన్నికలో 650 మంది తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. విష్ణు మంచుకు ఆల్‌ ది బెస్ట్‌'' అని అన్నారు. ఈ మేరకు మంచు విష్ణును ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు ప్రకాష్ రాజ్. నరేష్ మాట్లాడుతూ.. ''నేను వెళ్లేటప్పుడు మంచి వారసుడిని ఇచ్చి వెళతాను అని చెప్పా. మంచు విష్ణు రూపంలో మంచి వారసుడు వచ్చాడు. ‘మా’ మసకబారలేదు.. మెరుగుపడింది'' అని పేర్కొన్నారు.


By October 11, 2021 at 08:43AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/maa-elections-2021-manchu-vishnu-and-prakash-raj-speech-after-results/articleshow/86927934.cms

No comments