Breaking News

MAA elections: ‘మా’ ఎన్నికల్లో రిగ్గింగ్.. ఆగిన పోలింగ్... చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన మోహన్‌బాబు


ఈరోజు (ఆదివారం, అక్టోబర్ 10) మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(‘మా’ ) ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు ప్యానెల్ అభ్యర్థులు ఎన్నికల ప్రాంగణం బయట నిలబడి ఉన్నారు. అసోసియేషన్ సభ్యులు వచ్చి ఓటేసి వెళుతున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తదితరలుు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంత సవ్యంగా జరుగుతుందని అనుకుంటున్న తరుణంలో ఉన్నట్టుండి ‘మా’ ఎన్నికల్లో చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. రెండు గ్రూపులకు చెందిన కొందరు సభ్యుల మధ్య తోపులాట జరిగింది. అసోషియేషన్ కార్డు లేని కొందరు సభ్యులు ఓటు వేయడానికి ప్రయత్నించారనేది ఆరోపణ. కాసేపు పోలింగ్‌ను ఆపేశారు. ఈ క్రమంలో మంచు విష్ణు ప్యానెల్ తరపున మంచు మోహన్ బాబు కోపంతో ఊగిపోయారు. బెనర్జీకి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల అధికారికి రిగ్గింగ్ చేస్తున్నారని కూడా ఫిర్యాదు వెళ్లింది. దీంతో ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. రిగ్గింగ్ జరిగినట్లు నిర్దారణ అయితే ఫలితాలను ఆపేస్తామని ఆయన అన్నారు. అదే సమయంలో ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న విష్ణు మంచు, ప్రకాశ్ రాజ్ భుజాలపై చేతులు వేసుకుని వచ్చి మీడియాతో మాట్లాడారు. తామిద్దరం కలిసే ఉన్నామని తెలిపారు. ఎన్నికల వరకే ఇలాంటి ఘటనలుంటాయని, తర్వాత అందరం కలిసి పనిచేస్తామని అన్నారు.


By October 10, 2021 at 10:34AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rigging-in-maa-elections-mohan-babu-warned-benerji/articleshow/86907384.cms

No comments