HBD Prabhas : ఆడు ఎక్కడున్నా రాజే!.. అసలు సిసలు పాన్ ఇండియన్ హీరో
బాహబలి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. బిజ్జలదేవ ఓ సందర్భంగా అమరేంద్ర బాహుబలి గురించి చెబుతాడు. ఆడు బతికి ఉంటే.. ఎక్కడున్నా రాజేరా అని అంటాడు. అది ఇప్పుడు నిజ జీవితంలో ప్రభాస్‌కు వర్తిస్తుంది. రాజుల రక్తం ఒంట్లో పారుతున్న ప్రభాస్.. ఇప్పుడు భారత సినీ రాజ్యానికి ఏకఛత్రాధిపతి అయ్యాడు. అసలు సిసలు పాన్ ఇండియన్ హీరోగా మారిపోయాడు. ఇక అంతర్జాతీయ స్థాయిలోనూ ఎవ్వరికీ సొంతం కానటువంటి క్రేజ్‌ను తెచ్చుకున్నాడు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి కథలను ఎంచుకుంటున్నాడు. ఈశ్వర్ సినిమాతో మొదలైన ప్రభాస్ ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. రెండో చిత్రంగా వచ్చిన రాఘవేంద్ర అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ మూడో సినిమాగా వచ్చిన వర్షం ప్రభాస్‌ను స్టార్ హీరోగా నిలబెట్టేసింది. అలా ఛత్రపతి కూడా వచ్చింది. దీంతో తిరుగులేని మాస్ ఫాలోయింగ్‌తో ముందుకు దూసుకుపోయాడు. ప్రభాస్ కెరీర్‌లో మాస్, క్లాస్ హిట్స్ ఉన్నాయి. బిల్లా మాస్ హిట్ అయితే.. మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, డార్లింగ్ వంటి చిత్రాలు క్లాస్ హిట్స్‌గా నిలిచాయి. అలా ప్రభాస్ మాస్ ఆడియెన్స్, క్లాస్ ఆడియెన్స్ అని తేడా లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇమేజ్ మారిపోయింది. జాతీయస్థాయి దాటి అంతర్జాతీయ స్థాయికి ప్రభాస్ ఇమేజ్ పెరిగింది. చైనా, జపాన్ వంటి దేశాల్లో ప్రభాస్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే జపాన్, చైనా వంటి ఇతర దేశాల్లోనూ రిలీజ్ కావాల్సిందే. అలా ప్రభాస్ ఇప్పుడు లైన్‌లో పెట్టిన చిత్రాలు కూడా అదే విధంగా రాబోతోన్నాయి. అన్నింటి కంటే ముందుగా రాబోతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాధే శ్యామ్ తరువాత , , ప్రాజెక్ట్ కే, సందీప్ రెడ్డి వంగా చిత్రాలు ఇలా అన్నీ కూడా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌లే. వాటిని అంతర్జాతీయ స్థాయిలోనే తెరకెక్కిస్తున్నారు. అలా ప్రభాస్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడున్నా రాజే అని నిరూపించుకుంటున్నాడు.
By October 23, 2021 at 07:33AM
No comments