Breaking News

Good luck sakhi: కీర్తి సురేష్ పుట్టినరోజు కానుక: ‘గుడ్ లక్ సఖి’ టీం స్పెషల్ పోస్టర్


యంగ్ హీరోయిన్ ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఈ క్రమంలోనే '' సినిమాతో కీర్తి సురేష్ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రావ్యా వర్మ సహ నిర్మాతగా ఈ చిత్రం రాబోతోంది. నేడు (అక్టోబర్ 17) కీర్తి సురేష్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ గుడ్ లక్ సఖి టీం నుంచి స్పెషల్ పోస్టర్‌ విడుదల చేశారు. గురి చూసి కొడుతున్నట్టుగా ఉన్న కీర్తి సురేష్ పోస్టర్‌లో అదరగొట్టేశారు. గన్నుతో గురి చూసి కొడుతున్న కీర్తి సురేష్ అభిమానులను కిక్కిచ్చారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ గ్రామీణ అమ్మాయిగా కనిపించనుంది. ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో కీర్తి సురేష్ షూటర్‌గా నటించారు. నవంబర్‌ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టు ఈ కొత్త పోస్టర్‌ ద్వారా ప్రకటించారు. దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ మీద సుధీర్ చంద్ర పదిరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగేశ్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మళయాల భాషల్లో ఒకే సారి విడుదల చేయబోతోన్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇకపోతే ఈ సినిమాతో పాటు మహేష్ బభౌ సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న భారీ సినిమా భోళా శంకర్‌లో కీలకపాత్ర పోషిస్తోంది. కీర్తి పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు చిత్ర నుంచి కూడా స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్.


By October 17, 2021 at 01:39PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hbd-keerthy-suresh-good-luck-sakhi-team-released-special-poster/articleshow/87080220.cms

No comments