Breaking News

Chiranjeevi: రూమర్స్‌కు చెక్ పెట్టిన చిరంజీవి.. ‘భోళా శంకర్’పై క్రేజీ అప్ డేట్


స్పీడుతో కుర్ర హీరోల‌కు గ‌ట్టి పోటీనే ఇస్తున్నారు. ఇప్ప‌టికే ఆచార్య సినిమాను పూర్తి చేసిన ఆయ‌న త‌న 153వ చిత్రం గాడ్‌ఫాద‌ర్ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి అవ‌క‌ముందే, త‌న 154వ సినిమాకు సంబంధించిన వ‌స్తున్న వార్త‌ల‌పై అప్‌డేట్ ఇచ్చి చెక్ పెట్టేశారు. చిరంజీవి, మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌బోయే ‘’ సినిమాను కాస్త వెన‌క్కి వెళ్లి, చిరంజీవి, బాబీ కాంబినేష‌న్‌లో రూపొంద‌బోయే సినిమా ముందుగా ప్రారంభం అవుతుంద‌ని దాని రీసెంట్‌గా వార్త‌లు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. అయితే దీనిపై మెగా క్యాంప్ అప్పుడేమీ స్పందించ‌లేదు. అయితే బుధ‌వారం భోళాశంక‌ర్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ను అనౌన్స్ చేసి ఈ రూమ‌ర్స్‌కు చెక్ పెట్టేశారు. న‌వంబ‌ర్ 11న సినిమా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయి. సినిమా లాంఛ‌నంగా ప్రారంభం అవుతుంది. చిరంజీవి ఎక్కువ గ్యాప్ తీసుకోవ‌డం లేదు. న‌వంబ‌ర్ 15 నుంచే సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని నిర్మాణ సంస్థ ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తెలియ‌జేసింది. త‌మిళ చిత్రం వేదాళంకు ఇది రీమేక్‌. అజిత్ చేసిన పాత్ర‌ను తెలుగులో చిరంజీవి చేస్తుంటే, త‌మిళంలో చెల్లెలుగా చేసిన ల‌క్ష్మీ మీన‌న్ పాత్ర‌ను తెలుగులో కీర్తి సురేశ్ చేస్తున్నారు. హీరోయిన్‌, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. మ‌ణిశ‌ర్మ త‌న‌యుడు మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. వ‌చ్చే ఏడాదిలో సినిమాను విడుద‌ల చేస్తామ‌ని కూడా ఇప్పుడే మేక‌ర్స్ తెలిపారు. వ‌చ్చే ఏడాది మెగాభిమానులకు పండ‌గే. ఎందుకంటే.. చిరంజీవి సినిమాలే మూడు వ‌చ్చే ఏడాది థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తున్నాయి. ఫిబ్ర‌వ‌రి 4న చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన ఆచార్య విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. దాని త‌ర్వాత గాడ్‌ఫాద‌ర్ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ వెంట‌నే బోళా శంక‌ర్ సినిమాను విడుద‌ల‌కు సిద్ధం చేస్తారు. బోళా శంక‌ర్ సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా న‌డిచే చిత్రం. ఇందులో చిరంజీవి టాక్సీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. కీర్తి సురేశ్ డాక్ట‌ర్ పాత్ర‌లో మెప్పించ‌బోతున్నారు.


By October 27, 2021 at 09:52AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/megastar-chiranjeevi-crazy-update-on-bholaa-shankar/articleshow/87297419.cms

No comments