ఆ పిల్ల బాత్‌రూమ్‌లో నాకేం పని... వైరల్ అవుతోన్న ప్రభాస్ కామెంట్స్
హీరో ప్రభాస్ ఎప్పుడు ఏది మాట్లాడినా, ఏ పని చేసినా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఇమేజ్ అలాంటిది మరి. తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ హీరోయిన్ గురించి మాట్లాడిన ఓ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ప్రభాస్ ఏమన్నారో తెలుసా? ‘ఆ పిల్ల బాత్‌రూమ్‌లో నేనెందుకుంటాన్నా.. నేను కూడా లేను’ అసలు మన డార్లింగ్ ఈ మాటను ఏ పిల్లను ఉద్దేశించి అన్నారంటే.. హీరోయిన్ కేతికా శర్మ గురించి. అసలు కేతికా శర్మ బాత్ రూమ్ గోల ఏంటంటే.. ట్రైలర్‌ను ప్రభాస్ రిలీజ్ చేసి ఆకాశ్ పూరి, కేతికా శర్మను పది నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో హీరోయిన్ కేతికా శర్మ మాట్లాడుతూ ‘నేను చిన్నప్పటి నుంచి నటి కావాలని కల కన్నా’నంది. అప్పుడు ఆకాశ్ పూరి అందుకుని ‘తను చాలా మంచి సింగర్’ అనగానే.. ప్రభాస్ ‘అవునా.. అయితే నా కోసం ఓ పాట పాడు’ అని అన్నారు. అప్పుడు కేతికా శర్మ ‘సార్ నాకు కాస్త సిగ్గుగా ఉంది. నేను బేసిగ్గా బాత్‌రూమ్ సింగర్’ని అంది. అప్పుడు ఆకాశ్ ‘ఇది కూడా బాత్‌రూమ్ అనుకుని పాడెయ్.. నేను, డార్లింగ్ కూడా ఇక్కడ లేమనుకో’ అన్నాడు. దానికి వెంటనే ప్రభాస్ రియాక్ట్ అయిపోయారు. ‘ఆ పిల్ల బాత్‌రూమ్‌లో నేనెందుకుంటాన్రా?’ అని అన్నారు. అప్పుడు కేతికా శర్మ రొమాంటిక్ సినిమాలో పాటను పాడింది. పాట పాడిన తర్వాత కేతికను ప్రభాస్ మెచ్చుకున్నారు. గొంతు చాలా బావుందన్నారు. ఒకప్పుడు హీరోయిన్స్ వారి సినిమాల్లో పాటలను వారే పాడుకునేవారు. వారి గొంతులు అలా ఉండేవి. ఇప్పుడు అలా పాటలు పాడుకునే హీరోయిన్స్ కేటగిరిలో నువ్వు కూడా చేరావు అన్నారు. పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా రూపొందిన చిత్రం ‘రొమాంటిక్’. హీరోగా తనకు ఇది రెండో చిత్రం. టైటిల్‌కు తగ్గట్లే సినిమాలో ఘాటు రొమాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించిన పోస్టర్స్, టీజర్, విడుదల చేసిన రెండు ట్రైలర్స్ సినిమా ఏ ప్యాట్రన్‌లో ఉండబోతుందనే విషయాన్ని చెప్పకనే చెప్పేసింది. అక్టోబర్ 29న సినిమా విడుదలవుతుండటంతో ఎంటైర్ యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉంది. సీనియర్ నటి రమ్యకృష్ణ ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ప్రేమలో ఉంటూ మోహంలో ఉన్నామనుకునే ప్రేమికులకే కథే ఈ ‘రొమాంటిక్’ అనిల్ పడూది దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పూరి, ఛార్మి నిర్మాతలు. పూరి ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలను అందించారు.
By October 27, 2021 at 09:24AM
No comments