Boyapati Srinu: బోయపాటి శ్రీను సినిమాను కన్‌ఫర్మ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్
హీరోయిజాన్ని మాస్ యాంగిల్‌లో ప్రజెంట్ చేసి ఆడియెన్స్ చేత సీటీలు కొట్టించే దర్శకుల్లో ఒకరు. సినిమాను ఆయన రిచ్‌గా, స్టైలిష్‌గా, మాస్ తెరపై ఆవిష్కరిస్తారనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఈ మాస్ డైరెక్టర్ నందమూరి బాలకృష్ణతో ‘అఖండ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన డైరెక్ట్ చేయబోయే సినిమాపై ఇన్ని రోజులు క్లారిటీ లేదు. అయితే రీసెంట్‌గా ఓ స్టార్ ప్రొడ్యూసర్ దానిపై క్లారిటీ ఇచ్చేశాడు. ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరో కాదు.. అల్లు అరవింద్. ఆహాలో నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ అనౌన్స్‌మెంట్ చేస్తూ ప్రోమో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ అనౌన్స్‌మెంట్ కార్యక్రమంలో అల్లు అరవింద్.. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న అఖండ సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమా భారీ సక్సెస్ కావాలని చెప్పిన అరవింద్, బోయపాటి శ్రీను అంటే బాలకృష్ణకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఆయనతో ఇప్పటికే మా బ్యానర్‌లో ఓ సినిమా చేశామని, త్వరలోనే మరో సినిమా చేయబోతున్నామని కూడా తెలిపారు. దీంతో గీతాఆర్ట్స్‌లో మరోసారి బోయపాటి శ్రీను సినిమా ఉంటుందనేది కన్‌ఫర్మ్ అయ్యింది. గత కొన్నిరోజుల నుంచి పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ తదుపరి చేయబోయే సినిమా ఏదనే దానిపై పూర్తి క్లారిటీ లేదు. ఎ.ఆర్.మురుగదాస్, బోయపాటిశ్రీను పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ చెప్పిన విషయం చూస్తుంటే అల్లు అర్జున్ తన ఓటును బోయపాటిశ్రీనుకే వేసినట్లు అనుకోవచ్చు. ఇది వరకు అల్లు అర్జున్, బోయపాటి శ్రీనులతో అల్లు అరవింద్.. సరైనోడు వంటి మాస్ మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి చేతులు కలపడం ఫిక్స్ అనుకోవచ్చు. ఇది పాన్ ఇండియా మూవీ రేంజ్‌లోనే రూపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.
By October 15, 2021 at 10:46AM
No comments