Antha Ishtam : రొమాంటిక్ మూడ్‌లో భీమ్లా నాయక్
అంటూ రానాలు తలపడే రోజు దగ్గరకు వస్తోంది. భీమ్లా నాయక్ పాత్రలో పవన్ కళ్యాన్, డేనియల్ శేఖర్‌గా రానా ఇద్దరికిద్దరు ఏ మాత్రం తగ్గని పాత్రలో కనిపించబోతోన్నారు. ఈ ఇద్దరు తలపడే సీన్లు తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని తీసుకొస్తాయి. అయితే మళయాలి వర్షెన్‌కు తెలుగు రీమేక్‌కు చాలానే తేడాలు ఉండబోతోన్నాయని అందరికీ అర్థమైంది. ఈ క్రమంలోనే ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ సినిమా అని చెప్పేందుకు టైటిల్ ఒక్కటే ఉదాహరణ. ఇక తాజాగా వదిలిన మెలోడీ పాటతో ఈ చిత్రంలో రానా పాత్రను ఎంతకు తగ్గించారో అర్థమవుతంది. అసలు ఈ డ్యూయెట్ పాటలు ఒరిజినల్‌లో ఉండవు. కానీ మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. ఈ క్రమంలోనే అంటూ భీమ్లా నాయక్‌లోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించారు. కేఎస్ చిత్రం గాత్రంలోని మాయను మరోసారి తమన్ మనకు పరిచయం చేశారు. ఇక రామజోగయ్య శాస్త్రి ఎప్పటిలానే ఎన్నో కొత్త పదాలతో అందరినీ మెప్పించారు. ఆయన రాసిన లైన్లకు అందరూ ఫిదా అవుతున్నారు. నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు.. నీకు నాకు దిస్టి తియ్యా అంటూ రాసిన లైన్‌ను అందరూ పొగిడేస్తున్నారు. అంత ఇష్టం ఏందయ్యా అంటూ చిత్ర పాడిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. మొత్తానికి ఈ మెలోడీ అందరి మైండ్లో తిరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగబోతోన్న ఈ మూవీపై అంచనాలు ఆకాశన్నంటాయి.
By October 15, 2021 at 11:01AM
No comments