చై- సామ్ విడాకులపై రాజీవ్ కనకాల కామెంట్.. ఒకే ఒక్క మాట!! చైతూ రియల్ లైఫ్ క్యారెక్టర్‌పై ఓపెన్..
ఇప్పుడు ఎక్కడ చూసినా జనాల్లో ఒక్కటే హాట్ టాపిక్. అదే నాగ చైతన్య- డివోర్స్ మ్యాటర్. టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఈ జోడీ ఉన్నట్టుండి తమ వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టడాన్ని ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. అసలు ఆ ఇద్దరి మధ్య ఏం జరిగి ఉంటుంది? ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే దానిపై పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే కొంతమంది సమంతపై బ్యాడ్ కామెంట్స్ చేస్తుంటే.. మాధవీలత లాంటి యాక్టర్ పరోక్షంగా అక్కినేని ఫ్యామిలీని నిందిస్తోంది. మరోవైపు సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల నడుమ నాగ చైతన్య- సమంత విడాకులపై స్పందిస్తూ ఒకే ఒక్క మాట అనేశారు. ఇటీవల హీరోగా రూపొందిన 'లవ్ స్టోరీ' మూవీలో రాజీవ్ నెగెటివ్ పాత్రలో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ సక్సెస్, ఆ సినిమా షూటింగ్ తాలూకు విశేషాలు పంచుకున్న రాజీవ్ కనకాల.. చైతూ రియల్ లైఫ్ క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడారు. నాగ చైతన్య- సమంత విడాకుల ఇష్యూ అనేది పూర్తిగా వాళ్ల వ్యక్తిగతం అని, దాని గురించి ఏం మాట్లాడలేం అని చెప్పిన రాజీవ్.. ఆ విషయం మాత్రం తనకు బాధ కలిగించిందని అన్నారు. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి మనం మాట్లాడటం సరికాదని చెప్పారు. అయితే రియల్ లైఫ్‌లో నాగ చైతన్య చాలా కూల్ పర్సన్ అని, ఆయనది ఎక్కడా విసుగు చెందే మనస్తత్వం కాదని తెలిపారు. సెట్స్‌లో అందరితో సరదాగా ఉంటూ తన పని తాను చేసుకొని వెళ్లేవారని చెప్పుకొచ్చారు. ఆయనను ఇలా బూస్ట్ చేయడం వల్ల తనకొచ్చే లాభం ఏమీ లేదని, తాను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నానని అన్నారు.
By October 06, 2021 at 08:36AM
No comments