ఇదీ మన పరిస్థితి.. సీఎం కేసీఆర్‌పై మోహన్ బాబు కామెంట్స్.. మంచు విష్ణు గెలుపు తర్వాత హీటు పెంచిన డైలాగ్ కింగ్
'మా' పోరులో మంచు విష్ణు విజయకేతనం ఎగురవేశారు. రసవత్తరపోరులో ప్రకాష్ రాజ్‌పై మంచు విష్ణు గెలుపొంది నూతన 'మా' అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే 'మా' ప్రచారపర్వంలో ఒకరిపై ఒకరు చేసుకున్న సంచలన కామెంట్స్, తుది ఫలితాల అనంతరం జరుగుతున్న పరిణామాలు, రాజీనామాలు చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు, మంచు విష్ణు తండ్రి మీడియా ముందుకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎంల జోలీ తీస్తూ ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ''సింహం నాలుగు అడుగులు వెనక్కి వేస్తోంది అంటే.. ఆలోచించుకోవడానికే.. ఆ తర్వాత విజృంభిస్తుంది'' అంటూ తన కొడుకు విష్ణుకు మొత్తం 'మా' సభ్యులు ఆశీస్సులు అందించారని మోహన్ బాబు కోరారు. తనకు మాట్లాడమని అవకాశం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ () గురించే మాట్లాడాలి తప్ప ఇది కాకుండా వేరే రాజకీయం మాట్లాడితే.. అంటూ మోహన్ బాబు చేసిన కామెంట్స్ జనాల్లో పలు చర్చలకు తెరలేపాయి. నేను మాట్లాడాల్సి వస్తే.. చాలా ఉంది మాట్లాడడానికి అంటూనే కొన్ని విషయాలపై మోహన్ బాబు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నన్ను రెచ్చగొట్టాలని చూస్తూనే ఉన్నారు. కానీ నేను అసమర్దుడిని కాను. మౌనంగా ఉండాలని ఉంటున్నా అంతే. అన్నీ నవ్వుతూ స్వీకరించాలి. మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. ఎప్పుడు సమాధానం చెప్పాలో అప్పుడే చెప్పాలి అని మోహన్ బాబు పేర్కొన్నారు. ఇక సీఎంల జోలి తీసిన ఆయన.. ''నిన్నటిది వేస్ట్ పేపర్. ఈ రోజు న్యూస్ పేపర్. రేపు క్వశ్చన్ పేపర్. రీడ్ అండ్ రైట్.. అదర్‌వైజ్ యు విల్ బికమ్ ఏ టిష్యూ పేపర్ అని మహానుభావుడు అబ్దుల్ కలాం గారు అన్నారు. అంటే గెలిచిన వారంతా రేపు క్వశ్చన్ పేపర్ అవుతారు. బాధ్యతగా ఆలోచించు.. సహాయం కోరుకో. ముఖ్యమంత్రుల సహాయ సహకారం లేకపోతే ఏమీ చేయలేము. సినీ నటులంతా కలిసి మన కష్టసుఖాలు చెప్పుకొని వారిని సన్మానించాలి. రాజశేఖర్ రెడ్డిగారు ఉన్నంత వరకు ఇదే జరిగింది. కళాకారులను ఎంకరేజ్ చేసేలా ప్రభుత్వం తరపున ఏవైనా అవార్డులు ఇవ్వాలని కోరితే ముఖ్యమంత్రులు చేస్తారు. కేసీఆర్ గారు ఎన్నో పథకాలు పెట్టారు. ఆయన చాలా గొప్ప నాయకుడు. ఈ రాష్ట్రంలో ఉన్నాం ఏరోజన్నా కేసీఆర్ గారిని పిలిచి సన్మానం చేశామా? ఏపీ సీఎం జగన్‌ను సత్కరించామా? నేను కాకా పట్టడం లేదు. లాస్ట్ టైమ్ ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన దగ్గరకీ పోలేదు. ఇప్పుడున్న జగన్ దగ్గరకి పోలేదు. ఆయన దగ్గరకి పోయి.. సార్ మేమందరం వస్తాం. మాకిలా సాయం చేయండి. మిమ్మల్ని కూడా మేము సన్మానించాలి. అంటే సన్మానానికి రానని అనడుగా. మీరు వేదిక మీదకి రండి మిమ్మిల్ని మేము గౌరవించాలి అని పిలవాలి. పార్టీల సంగతి పక్కనబెడితే 'మా' అనేది ఒకే ఫ్యామిలీ'' అని చెప్పారు మోహన్ బాబు.
By October 12, 2021 at 08:24AM
No comments