విడాకుల తరువాత మొదటి పోస్ట్.. కారణాలు చెప్పేసిన సమంత!
నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు. ఎవరి జీవితాన్ని వారు వేర్వేరుగా జీవించేందుకు సిద్దపడ్డారు. భార్యభర్తలుగా విడిపోయినా కూడా స్నేహితుల్లా కలిసి ఉంటామని, తమ బంధం అలానే కొనసాగుతామని అన్నారు. విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ కూడా ఒకే రకమైన ప్రెస్ నోట్‌ను వదిలారు. అయితే ఈ విడాకుల వ్యవహారంపై ఎవరికి తోచినట్టుగా వారు ఊహించేసుకుంటున్నారు. చైసామ్ మధ్య కెరీర్ పరంగా విబేధాలు వచ్చాయని, అందుకే ఎవరి దారి వారు చూసుకునేందుకు సిద్దపడ్డారని టాక్ వచ్చింది. సినీ కెరీర్‌కు అడ్డు పడుతున్నారనే ఉద్దేశ్యంతోనే చైతూతో తీసుకుందనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. సమంతకు ఆంక్షలు విధించడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే అక్టోబర్ 2 నుంచి సమంత సైలెంట్‌గానే ఉంటుంది. విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించిన క్షణం నుంచి ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. సోషల్ మీడియాకు దూరంగా ఉండిపోయింది. కానీ కాసేపటి క్రితమే ఓపోస్ట్ చేసింది. అందులోని సారాంశాన్ని గమనిస్తే.. విడాకుల వెనుకున్న కారణాలు చెప్పకనే చెప్పేసినట్టు కనిపిస్తోంది. ‘ఈ ప్రపంచాన్ని మనం మార్చేయాలని అనుకుంటే.. ముందుగా మనం మారాలి.. మనది మనమే అన్ని పనులను చేసుకోవాలి. మనమే మన షెల్ఫ్‌ల దుమ్ముదులపాలి. మధ్యాహ్నం వరకు నిద్రపోతూ మన లక్ష్యాలు గుర్తు చేసుకోకూడదు.. కలలు కనొద్దు.. ’ అంటూ ఏదో పరోక్షంగా చెప్పేందుకు ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. తనది తాను ఒంటరిగా నిలబడి, తన లక్ష్యాలు, తన కలలను సాకారం చేసుకునేందుకు సమంత ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఆంక్షలు పెట్టిన అక్కినేని ట్యాగ్‌ను ఇలా దూరం పెట్టేసినట్టు అర్థమవుతోంది.
By October 04, 2021 at 08:25AM
No comments