Breaking News

వివాహితతో సీఐ అక్రమ సంబంధం.. రాసలీలల వీడియోలతో ఊహించని ఝలక్ ఇచ్చిన బాధితుడు!


ఓ మహిళతో రాసలీలలు సాగిస్తున్న వీడియో బయటకు రావడంతో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు అధికారులు ఝలక్ ఇచ్చారు. శాఖపరమైన చర్యలు తీసుకున్న అధికారులు.. రాత్రికి రాత్రే విధుల నుంచి తప్పించి, వెయిటింగ్‌లో పెట్టారు. అధికారులు ఎందుకలా చేశారో తెలియక సీఐ ఆశ్చర్యపోయారు. చివరకు రాసలీలల్లో పాల్గొన్న వివాహిత భర్త.. ఆ వీడియోతో పాటు పలు ఆధారాలను ఉన్నతాధికారులకు అందజేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తమిళనాడులోని జిల్లాలో చోటుచేసుకుంది. తిరుక్కళుకుండ్రమ్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ ముని శేఖర్‌ (50) ఓ వివాహితతో రాసలీలల్లో మునిగితేలిన వీడియో అధికారుల కంటబడింది. ఈ స్టేషనులో శాంతి భద్రతల విభాగం సీఐగా పనిచేసే మునిశేఖర్‌‌ను విధుల నుంచి తప్పించి వెయిటింగ్‌లిస్ట్‌లో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న మునిశేఖర్‌ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయనపై చర్య తీసుకోవడానికి ప్రధాన కారణం.. వివాహితతో జరిపిన రాసలీలలకు సంబంధించిన వీడియోతో పాటు పలు ఆరోపణలు చేస్తూ ఓ వ్యక్తి డీజీపీతో పాటు ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. ఈ ఫిర్యాదులో అనేక విషయాలను తెలిపిన బాధితుడు.. ముఖ్యంగా తన భార్యతో మునిశేఖర్‌కు వివాహేతర సంబంధం ఉందని పేర్కొన్నాడు. దీనికి సంబంధించి తన భార్యతో గడిపిన వీడియోలు ఉన్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని తన భార్యను నిలదీస్తే ఆమె సరైన సమాధానం చెప్ప లేదన్నాడు. ఇదే విషయమై ఇన్‌స్పెక్టర్‌ను ప్రశ్నిస్తే తనను, తన కుటుంబాన్ని హత్య చేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించాడు. బాధితుడు ఫిర్యాదు ప్రకారం.. ‘తొమ్మిదేళ్ల నుంచి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నెల్‌వాయల్ గ్రామంలో ఉంటున్నాం.. తన భార్య తిరుక్కళుకుండ్రమ్‌‌లోని సోదరి ఇంటికి వెళ్లేది.. ఈ క్రమంలో నన్ను, పిల్లలను దూరం పెట్టడం.. దీనిపై నిలదీయడంతో ఇరువురికీ గొడవలు జరిగాయి.. అనుమానం వచ్చి ఆమె ఫోన్‌ను పరిశీలించడంతో మునిశేఖర్‌తో సంబంధం ఉన్నట్టు తెలసింది’ అన్నాడు. ఇదే సమయలో మునిశేఖర్‌ వీడియోకాల్స్‌ చేసి నగ్నంగా మహిళతో మాట్లాడుతున్న వీడియోలు వాట్సాప్‌లలో వైరల్‌ అయ్యాయి. ఈ విషయం కూడా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు.. మునిశేఖర్‌పై చర్యలు తీసుకున్నారు. ఇక, రాజస్థాన్ పాలిలో అండర్‌ కవర్ ఆపరేషన్‌‌కు వెళ్లిన పోలీసు బృందంలో ఉన్న మునిశేఖర్.. సహచరుడిపై అనుకోకుండా కాల్పులు జరిపిన కేసులో నిందితుడిగా ఉన్నారు.


By October 05, 2021 at 08:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tamil-nadu-tirukalukundram-ci-munisekhar-suddenly-transfer-due-to-illegal-affair-with-woman/articleshow/86770868.cms

No comments