ఆ ప్రేమే గొప్పది!.. మనసులోని మాట చెప్పేసిన సమంత.. ఆ విషయంలో పశ్చాత్తాపడుతుందా?
ప్రస్తుతం దుబాయ్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి తెగ చక్కర్లు కొట్టేసింది. మొన్నటి వరకు శిల్పారెడ్డితో కలిసి తీర్థయాత్రల్లో మునిగింది. చార్ ధామ్ యాత్ర అంటూ హిమాలయాలను చుట్టి వచ్చింది. ఇప్పుడు , ప్రీతమ్ జుకల్కర్‌లతో కలిసి సమంత దుబాయ్‌కి చెక్కేసింది. అయితే భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ కోసం అక్కడికి వెళ్లి ఉంటుదని కొందరు అంటున్నారు. అయితే ఏదైనా షూటింగ్ నిమిత్తం కూడా వెళ్లి ఉండొచ్చని అనుకుంటున్నారు. మొత్తానికి సమంత దుబాయ్ ట్రిప్ మాత్రం ఫుల్ స్వింగులో ఉందని తెలుస్తోంది. సమంత రెండ్రోజుల క్రితం దుబాయ్‌కి వెళ్లింది. అక్కడి వీధుల్లో చక్కర్లు కొటేసింది. తన గ్యాంగుతో కలిసి సమంత రెస్టారెంట్లలో వెరైటీ ఫుడ్స్‌ను టేస్ట్ చేసింది. ఇక అలా ఫుడ్ టేస్ట్ చేస్తుంటే ఏవో గుర్తుకు వస్తున్నాయంటూ నీరజ కోనను కూడా ట్యాగ్ చేసింది. అలా సమంత మొత్తానికి ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక నాగ చైతన్య మెమోరీస్ కూడా తన దగ్గరు ఉంచుకునేందుకు కూడా సమంత ఇష్టపడటం లేనట్టు కనిపిస్తోంది. ఇన్ స్టాగ్రాం నుంచి చైతూ ఫోటోలను సమంత డిలీట్ చేసేసింది. అయితే సమంత తాజాగా ఓ పోస్ట్ చేసింది. తన ఫ్రెండ్ సాధన షేర్ చేసిన ఫోటోకు సమంత కామెంట్ పెట్టేసింది. సమంతతో కలిసి దిగిన సెల్ఫీని సాధన షేర్ చేసింది. సమంత ఎంతో అందంగా ఉందని కామెంట్ చేసింది సాధన. అలా సాధన చేసిన పోస్ట్‌కు సమంత రిప్లై ఇచ్చింది సెల్ఫ్ లవ్ అన్నింటికంటే బెస్ట్ అంటూ సమంత చెప్పేసింది. అంటే ఇది వరకు వేరే వాళ్లను ప్రేమించి తప్పు చేసిందా? అందుకే సెల్ఫ్ లవ్వే బెటర్ అని రియలైజ్ అయిందా? అని అంతా అనుకుంటున్నారు.
By October 28, 2021 at 10:47PM
No comments