బూతులు మాట్లాడారు.. శ్రీహరి అంకుల్ బతికి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.. ప్రకాష్ రాజ్‌పై మంచు విష్ణు ఫైర్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ () ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో హీటెక్కిపోతోంది. అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నువ్వా.. నేనా అన్నట్లుగా ఓ రేంజ్‌లో విమర్శించుకుంటున్నారు. అక్టోబర్ 10న 'మా' ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రెస్ మీట్స్ పెట్టి మరీ ఒకరిపై ఒకరు చేసుకుంటున్న కామెంట్స్ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. అటు ప్రకాష్ రాజ్, ఇటు మంచు విష్ణు తగ్గేదే లే.. అన్నట్లుగా మాటల తూటాలతో రెచ్చిపోతున్నారు. ఆఖరికి గతంలో జరిగిన చేదు అనుభవాలను, అలాగే పొరపాట్లను కూడా వెలికితీస్తూ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ తీరుపై, ఆయన మాట్లాడుతున్న విధానంపై మంచు విష్ణు మరోసారి విరుచుకుపడ్డారు. ఏదైనా ఉంటే నాతో తలపడు కానీ మంచు ఫ్యామిలీ జోలికొస్తే బాగుండదని వార్నింగ్ కూడా ఇచ్చేశారు. ఈ క్రమంలోనే దివంగత నటుడు శ్రీహరి టాపిక్ తీస్తూ ప్రకాష్ రాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు విష్ణు. అసలు నిజాలు అన్నీ మర్చిపోయారా. 2004 - 2005లో ఏం జరిగిందో గుర్తు లేదా? శ్రీహరి అంకుల్ గానీ బతికి ఉంటే మీకు సరైన గుణపాఠం చెప్పేవారు. ప్రస్తుతం స్వర్గంలో ఉన్న ఆయనే మీకు సరైన సమాధానం చెప్పేవారంటూ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు మంచు విష్ణు. ‘మా’ అసోసియేషన్‌ని ప్రకాష్ రాజ్ రెండుగా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంటూ ఫైర్ అయ్యారు. ఇకపోతే ‘మా’ ఎన్నికలు ఈవీఎం విధానంలో జరపాలని ప్రకాష్ రాజ్ కోరగా, బ్యాలెట్ విధానంలో జరపాలని విష్ణు మంచు ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో బ్యాలెట్ పద్ధతిలోనే ‘మా’ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ అధికారికంగా తెలిపారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కృష్ణంరాజు కూడా బ్యాలెట్ విధానానికే మొగ్గు చూపడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
By October 06, 2021 at 06:51AM
No comments