మళ్లీ పెళ్లి చేసుకుంటున్న మంచు మనోజ్... నన్ను కూడా తప్పకుండా పిలవండంటూ సెటైర్ వేసిన హీరో
సినీ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న మంచు మోహన్‌బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఆయన నట వారసులుగా విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న ఇండస్ట్రీలో ఉన్నారు. వీరిలో మంచు మనోజ్ విషయానికి వస్తే.. కొన్నాళ్లుగా ఆయన సినీ రంగానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. కాస్త గ్యాప్ తర్వాత అహం బ్రహ్మాస్మి అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఇక ఆయన వ్యక్తిగత విషయానికి సంబంధించిన వార్తొకటి నెట్టింట వైరల్ అయ్యింది. అదేంటంటే 2015లో ప్రణతిని పెళ్లి చేసుకున్న మనోజ్, కొన్ని కారణాలతో ఆమె నుంచి విడిపోయారు. అప్పటి నుంచి ఆయన ఎక్కువగా తిరుపతిలోని తన విద్యాసంస్థల దగ్గరే ఉంటున్నారు. ఏదో పని ఉండటం, టేదా షూటింగుల సమయంలోనే ఇక్కడకు వస్తున్నారు. అయితే మంచు మనోజ్ త్వరలోనే మరో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అది కూడా ఓ విదేశాలకు చెందిన అమ్మాయినే మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా రాశారు. అయితే ఎప్పుడూ ఈ వార్తలపై స్పందించని మంచు మనోజ్..ఈసారి మాత్రం సైలెంట్‌గా ఉండాలనుకోలేదు. తన రెండో పెళ్లి గురించి వార్త రాసిన సదరు మాధ్యమంపై తనదైన శైలిలో సెటైరికల్‌గా స్పందించారు. సదరు లింక్‌ను తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ నన్ను కూడా దయచేసి పిలవండి అన్నారు మనోజ్. పెళ్లి జరిగే స్థలం ఎక్కడ.. ఆ బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల ఎవరు? అంతా మీ ఇష్టం రా మీ ఇష్టం.. అని కన్నుకొట్టి నాలుక బయట పెట్టే సింబల్‌ను పోస్ట్ చేశారు. ఇలా మనోజ్ తనదైన స్టైల్‌లో వెటకారంగా చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఒక వైపు తండ్రి స్టార్ట్ చేసిన విద్యా సంస్థల బాధ్యతలను చూసుకుంటున్న మంచు మనోజ్.. ఏకంగా అహం బ్రహ్మాస్మి అనే పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేశాడు. అది కూడా తన సొంత బ్యానర్‌లో. ఎంఎం ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’ని నిర్మిస్తున్నట్టు ఇటీవల మనోజ్ ప్రకటించడంతో పాటు కోపం. శాంతం, ఆనందం కనిపించేలా మూడు డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉన్న పోస్టర్‌ను ఫస్ట్‌లుక్‌గా రిలీజ్ చేశారు మంచు మనోజ్. ఈ సినిమాకు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి అప్ డేట్స్ మాత్రం ఇవ్వడం లేదని ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
By October 27, 2021 at 10:56AM
No comments