అలాంటి పనులు చేయోద్దంటూ అసహనం!.. శివ బాలాజి భార్యపై మోహన్ బాబు ఆగ్రహం
మా అధ్యక్షుడిగా శనివారం ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫర్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎన్నో ఘటనలు జరిగాయి. పరోక్షంగా మెగా ఫ్యామిలీ మీద చాలానే పంచ్‌లు, సెటైర్లు పడ్డాయి. స్పీచులో చాలానే ఆటంకాలు ఏర్పడ్డాయి. అసలు మంచు విష్ణుని స్టేజ్ మీద అభినందించేందుకు, శాలువాలు కప్పి ఫోటోలు దిగేందుకు చాలా మంది వచ్చారు. ఎంత సేపటికి స్టేజ్ మీద జనాలు కిందకి దిగకపోవడంతో రంగంలోకి మోహన్ బాబు వచ్చాడు. మైకు అందుకుని తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. అందరినీ వారించే ప్రయత్నం చేశాడు. ఏయ్ ఎవరు అక్కడ.. ఆ మూలకు ఉన్నది ఎవరు అంటూ గద్మాయించే ప్రయత్నం చేశాడు. లైవ్ నడుస్తోంది అని మోహన్ బాబుకు విష్ణు చెప్పాడు. ఏం కాదు అంటూ మోహన్ బాబు తన స్టైల్లో తాను వెళ్లిపోయాడు. ఆ తరువాత ఎంతో సీరియస్‌గా తన ప్రసంగాన్ని కొనసాగించాడ మోహన్ బాబు. అయితే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా భార్య, నటి వ్యవహరించింది. మోహన్ బాబు ప్రసంగిస్తుంటే.. మధ్యలో అటూ ఇటూ కదిలింది. దీంతో మోహన్ బాబుకు చిర్రెత్తుకొచ్చినట్టుంది. ఏయ్.. అలా అటూ ఇటూ కదలొద్దు.. ఒకరు ప్రసంగం ఇస్తుంటే అలా కదిలిదే.. శ్రద్ద దెబ్బ తింటుంది.. అలా చేయకు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో మోహన్ బాబు తన ప్రసంగం మరిచిపోయాడు. మళ్లీ కొత్తగా ప్రారంభించాడు.
By October 17, 2021 at 07:43AM
No comments