Breaking News

పెద్ద నోట్లపై గాంధీ బొమ్మ తొలగించండి.. ప్రధానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన లేఖ


రూ. 2,000, 500 నోట్లపై మహాత్మాగాంధీ బొమ్మను వెంటనే తొలగించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లేఖ రాశారు. ఈ నోట్లను అవినీతితో పాటు బార్లలోనూ ఉపయోగిస్తున్నారని, కాబట్టి వాటిపై గాంధీ బొమ్మ ఉండడం హర్షనీయం కాదని ఆయన పేర్కొన్నారు. రాజస్థాన్‌లో ఇటీవల అవినీతి కేసులు బయటపడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్‌పూర్ ప్రధానికి ఈ లేఖ రాశారు. జనవరి 2019 నుంచి రాజస్థాన్‌లో రోజుకు రెండు కేసుల చొప్పున బయటపడతున్నాయి. జనవరి 2019 నుంచి 2020 డిసెంబరు 31 మధ్య మొత్తంగా 616 కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. గాంధీ 152వ జయంతి సందర్భంగా అక్టోబరు 2న ఈ లేఖ రాశారు. పెద్ద నోట్లు దుర్వినియోగం అవుతున్నాయి.. కాబట్టి వాటిపై ఉన్న గాంధీ బొమ్మను తొలగించాలని ఆ లేఖలో కోరారు. అంతేకాదు, రూ. 5, రూ. 10, రూ. 50, రూ. 100, రూ. 200 నోట్లపై మాత్రమే గాంధీ బొమ్మను ఉంచాలని ఆయన సూచించారు. ఆ నోట్లను ఎక్కువగా పేదలే ఉపయోగిస్తుంటారని, కాబట్టి దుర్వినియోగం అయ్యే అవకాశం లేదని అన్నారు. పెద్ద నోట్లపై గాంధీ బొమ్మను తొలగించి ఆ స్థానంలో ఆయన కళ్లద్దాలను ఉపయోగించవచ్చని సూచించారు. అలాగే, అశోక చక్రాన్ని కూడా నోట్లపై ఉపయోగించుకోవచ్చని అన్నారు. గత ఏడున్నర దశాబ్దాలుగా దేశంలో అవినీతి దారుణంగా పెరిగిపోయిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ‘నిజాయితీ మారుపేరైన గాంధీజీ చిత్రాన్ని రూ.500, రూ.2,000 నోట్లపై ముద్రించారు.. కానీ, వీటిని అవినీతి, లంచాల కోసం వాడుతున్నారు.. అత్యధిక విలువైన ఈ నోట్లను బార్లలోనూ ఉపయోగిస్తున్నారు.. ఇది మహాత్ముడికి అవమానం’ అని వ్యాఖ్యానించారు.


By October 08, 2021 at 08:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rajasthan-congress-mla-write-a-letter-to-pm-for-removal-of-gandhis-picture-from-2000-notes/articleshow/86857260.cms

No comments