Breaking News

ఐరాస మానవ హక్కుల మండలికి భారీ మెజార్టీతో ఎన్నికైన భారత్


ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ ()కు భారత్ తిరిగి ఎన్నికయ్యింది. మూడేళ్ల పదవీ కాలానికి (2022-24) గురువారం ఐరాస సాధారణ సభలో అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. ఈ ఎన్నికను ‘దేశానికి బలమైన ఆమోదం’ గా అభివర్ణించిన భారత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి.. ప్రజాస్వామ్యం, బహుళ వ్యవస్థలు, ప్రాథమిక హక్కులలో బలమైన మూలాలు రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయని వ్యాఖ్యానించారు. మానవ హక్కుల మండలిలో కొత్తగా 18 మంది సభ్యుల నియామకం కోసం గురువారం ఎన్నిక నిర్వహించారు. ఈ 18 మంది సభ్యులు వచ్చే ఏడాది జనవరి నుంచి మూడేళ్ల పాటు కొనసాగుతారు. మొత్తం 193 సభ్యదేశాలకుగానూ.. ఎన్నికల్లో గెలవాలంటే 97 మంది మద్దతు అవసరం. అయితే, భారత్‌కు ఏకంగా 184 దేశాలు మద్దతుగా నిలవడం విశేషం. దీంతో ఐరాస మానవ హక్కుల మండలికి భారత్ ఆరోసారి ఎన్నికయ్యింది. ‘మానవ హక్కుల కౌన్సిల్ ఎన్నికలలో భారతదేశానికి ఈ అద్భుతమైన మద్దతు లభించినందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను.. ఇది మన రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్యం, బహుళత్వం, ప్రాథమిక హక్కులలో మన బలమైన మూలాలకు బలమైన ఆమోదం.. మాకు ఈ అద్భుత విజయాన్ని అందించిన ఐరాస సభ్య దేశాలకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి వ్యాఖ్యానించారు. ఐరాసలో భారత శాశ్వత మిషన్ ట్వీట్ చేస్తూ.. ‘భారతదేశం ఆరోసారి UNHRCకి అత్యధిక మెజారిటీతో తిరిగి ఎన్నికైంది.. భారతదేశం తన విశ్వాసాన్ని తిరిగి నిలబెట్టుకున్నందుకు UN సభ్య దేశాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు... "మేము సమ్మాన్, సంవాద్, సహయోగ్ ద్వారా మానవ హక్కుల ప్రచారం, రక్షణ కోసం కృషి చేస్తూనే ఉంటాం’ అని పేర్కొంది. భారత్ ప్రస్తుత పదవీకాలం డిసెంబరు 31తో ముగియనుంది. తాజాగా, ఆసియా పసిఫిక్ విభాగంలో భారత్, కజికిస్థాన్, మలేషియా, ఖతార్, యూఏఈ ఐదు సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 193 సభ్యదేశాలు రహస్య బ్యాలెట్ ఓటింగ్ విధానంలో 18 మంది సభ్య దేశాలను ఎన్నుకున్నాయి. అర్జెంటీనా, బెనిన్, కెమరూన్, ఎరిత్రియా, ఫిన్‌లాండ్, గాంబియా, హోండరూస్, భారత్, కజికిస్థాన్, లుథ్వేనియా, లగ్జెంబర్గ్, మలేషియా, మాంటినిగ్రో, పరుగ్వే, ఖతార్, సోమాలియా, యూఏఈ, అమెరికాలు కొత్తగా ఎన్నికయ్యాయి.


By October 15, 2021 at 07:53AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-re-elected-to-un-human-rights-council-with-overwhelming-majority/articleshow/87034418.cms

No comments