Breaking News

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్: పెళ్లి కాకుండానే కాపురం.. ప్రత్యేకంగా మహిళలకు అల్లు అరవింద్ రిక్వెస్ట్


కెరీర్‌లో టర్న్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అక్టోబర్ 15వ తేదీన విడుదలైన ఈ సినిమా సక్సెస్ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో ఆనందంలో ఉన్న యూనిట్ థాంక్యూ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో యూనిట్ సభ్యులతో పాటు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేదికపై నిర్మాత మాట్లాడుతూ పలు కీలక విషయాలపై రియాక్ట్ అయ్యారు. ఈ సినిమా త్వరలో ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుందని వార్తలు వచ్చాయి. నవంబర్ 12 నుంచి అందుబాటులోకి రానుందని అన్నారు. దీనిపై ఇప్పటికే చిత్రయూనిట్ రియాక్ట్ అయి ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చేయగా.. తాజాగా అల్లు అరవింద్ ఇదే విషయమై స్పందిస్తూ బాంబు పేల్చారు. ''ఈ సినిమాలో బ్యాచ్‌లర్ అనే టైటిల్ పెట్టి పెళ్లి కాకుండానే కాపురం చూపిస్తారు. అందుకే ఈ సినిమాలో కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఏంటంటే.. భార్యా భర్తలు కావాలంటే ఏయే అంశాలు కావాలో అవన్నీ ఈ సినిమాలో చూపించారు. భార్యాభర్తలు చూస్తే కచ్చితంగా మొహామొహాలు బోలెడుసార్లు చూసుకుంటారు. మహిళలు తప్పనిసరిగా మీ భర్తలను సినిమాకు తీసుకెళ్లండి. మెసేజ్ చూసి ఇద్దరూ ఆనందిస్తారు.. అది మా గ్యారెంటీ. ఇకపోతే ఈ మధ్య చాలా సినిమాలు ఓటీటీల్లో వస్తున్నాయి. కానీ కొన్ని నెలల వరకు ఈ సినిమా మాత్రం ఓటిటిలో రావడం లేదు. మీరంతా థియేటర్స్‌కు వెళ్లి చూడాల్సిందే. త్వరలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఓటీటీ రిలీజ్ అని అంటున్నారు. కానీ అది నిజం కాదు. థియేటర్ రన్ అంతా ముగిశాక చాలా కాలం తర్వాతే ఇది ఓటిటిలో వస్తుంది'' అని అన్నారు అల్లు అరవింద్.


By October 18, 2021 at 08:38AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/most-eligible-bachelor-thank-you-meet-allu-aravind-comments-viral/articleshow/87098414.cms

No comments