ప్రకాష్ రాజ్ ఓటమికి కారణాలివే! మెగా ఫ్యామిలీని నమ్ముకోవడమే ముంచేసిందా..? ఆ నిర్ణయాలే వెనక్కి నెట్టాయా..?
రెండు మూడు నెలలుగా సినీ వర్గాల్లో సంచలనంగా మారిన 'మా' ఎన్నికల తుది అంకం ముగిసింది. అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్, నడుమ హోరాహోరీ పోరు నడిచింది. ప్రచార పర్వంలో ఈ ఇద్దరూ ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో రసవత్తర వాతావరణంలో జరిగిన 'మా' పోలింగ్‌లో తన ప్రత్యర్థి ప్రకాష్ రాజ్‌పై మంచు విష్ణు విజయకేతనం ఎగురవేశారు. 107 ఓట్ల మెజారిటీతో ప్రకాష్ రాజ్‌ని ఓడించిన మంచు విష్ణు 'మా' నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఓటమికి కారణాలివే, ఆయన చేసిన పొరపాట్లు ఇవే అంటూ జనాల్లో పలు చర్చలు మొదలయ్యాయి. లోకల్- నాన్ లోకల్ ఇష్యూ ఎప్పుడైతే ప్రకాష్ రాజ్ తాను 'మా' అధ్యక్ష బరిలో ఉన్నానని ప్రకటించారో.. అప్పటినుంచి లోకల్- నాన్ లోకల్ ఇష్యూ తెరపైకి వచ్చింది. ప్రకాష్ రాజ్ తెలుగు సినీ పరిశ్రమకు చెందినవాడు కాదనే వాదనలు బలంగా వినిపించాయి. అయితే వీటిని తిప్పికొట్టడంలో ప్రకాష్ రాజ్ విఫలమయ్యాడని అంటున్నారు జనం. తాను తెలుగు వాడినే అని నిరూపించుకొని, నిలదొక్కుపోవడంలో ప్రకాష్ రాజ్ సరైన పద్దతిలో వెళ్లలేదని, అదే ఆయన ఓటమికి ప్రధాన కారణమైందని చెప్పుకుంటున్నారు. ఎవ్వరి మద్దతు అవసరం లేదు.. తొందరపాటు మాటలు 'మా' ఎన్నికల్లో తనకు, మంచు విష్ణుకు మధ్య రసవత్తర పోరు నడుస్తుందని తెలిసి కూడా ప్రకాష్ రాజ్ మాట్లాడిన తొందరపాటు మాటలు ఆయనకు శాపంగా మారాయని అంటున్నారు నెటిజన్లు. తనకు ఎవ్వరి మద్దతు అవసరం లేదని ఆయన చెప్పడం, ఇండస్ట్రీ పెద్దల ఆశీర్వాదం తీసుకోనని అనడం, కొందరు హీరోలపై సీరియస్ కామెంట్స్ చేయడం ఆయనకే దెబ్బేసిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. బిజీ ఆర్టిస్ట్ కావడం ఇకపోతే పలు భాషా చిత్రాల్లో ప్రకాష్ రాజ్ బిజీ ఆర్టిస్ట్ కావడం కూడా ఆయన ఓటమికి ఒక కారణమైందని చెప్పుకుంటున్నారు. పాన్ ఇండియా సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ప్రకాష్ రాజ్.. 'మా' సమస్యల కోసం ఎంతమేర సమయం కేటాయించగలరు? అది సాధ్యమేనా? అనే అనుమానాలు 'మా' సభ్యుల్లో నెలకొన్నాయని.. అందుకే ఆయనకు పట్టం కట్టలేదని అంటున్నారు. మెగా ఫ్యామిలీనే నమ్ముకోవడం ప్రకాశ్ రాజ్‌కు అనుకూలంగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కోట శ్రీనివాసరావుపై ఆయన చేసిన వ్యాఖ్యలను చాలామంది తప్పుబట్టారు. మెగా ఫ్యామిలీ అండదండ ఉందని బాహాటంగా చెప్పకపోయినా.. ప్రకాష్ రాజ్ మెగా అండ చూసుకునే తన శక్తి సామర్ధ్యాలపై ఫోకస్ పెట్టలేదని, అదే ఆయన పరాజయానికి మరో ముఖ్య కారణమైందని టాక్ నడుస్తోంది. మా బిల్డింగ్ ఇష్యూ.. 'మా' బిల్డింగ్ ఇష్యూపై ఓ రేంజ్ చర్చలు నడుస్తున్నా ఈ అంశంపై ఫోకస్ పెట్టి సరైన భరోసా ఇవ్వడంలో ప్రకాష్ రాజ్ విఫలమయ్యాడని, అదే ఆయన ప్రత్యర్థి మంచు విష్ణు 'మా' బిల్డింగ్ విషయమై గట్టి నిర్ణయం తీసుకొని దానిపై వాగ్దానాలు చేయడం ప్రకాష్ రాజ్ ఓటమికి మరో కారణమని జనం చెప్పుకుంటున్నారు. నరేష్ మద్దతు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇప్పటిదాకా 'మా' అధ్యక్షుడుగా పని చేసిన నరేష్ సపోర్ట్ మంచు విష్ణుకే దక్కడం, ఆయన అనుభవాలు, పరిచయాలు విష్ణుకే అనుకూలంగా మారడం ప్రకాష్ రాజ్‌కి ప్రతికూల అంశంగా మారిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. నరేష్ కారణంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా విషుకే పడటం ప్రకాష్ రాజ్ ఓటమిలో కీలకం అయిందని తెలుస్తోంది.
By October 11, 2021 at 10:04AM
No comments