Breaking News

టీవీ సీరియళ్లలో కౌగిలింతలు, పడక సీన్‌లపై బ్యాన్.. పాక్ సంచలన నిర్ణయం


టీవీ సీరియళ్లపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. స్థానిక సీరియళ్లలో కౌగిలింతలు, రొమాన్స్ సన్నివేశాల ప్రసారాన్ని నిలిపేయాలని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్‌ఏ) ఆదేశాలు జారీ చేసింది. ఒక ప్రకటన విడుదల చేసిన పీఈఎంఆర్ఏ... ఈ తరహా కంటెంట్‌పై పౌరుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అటువంటి కార్యక్రమాలు పాకిస్థాన్ సమాజం అసలైన సంస్కృతిని ప్రతిబింబించడం లేదని పేర్కొంది. సీరియళ్లలో వివాహేతర సంబంధాలు, అభ్యతరకరమైన దృశ్యాలు, కౌగిలింతలు, పడక సన్నివేశాలు, జంటల మధ్య సాన్నిహిత్యం తదితరమైనవి ఇస్లామిక్ బోధనలు, దేశ సంస్కృతిని పూర్తిగా విస్మరిస్తున్నాయని పీఈఎంఆర్‌ఏ ఆరోపించింది. ఈ నేపథ్యంలో అన్ని టీవీ ఛానళ్లు తమ సీరియళ్ల కంటెంట్‌ను ముందుగా అంతర్గత పర్యవేక్షణ కమిటీ ద్వారా పూర్తిస్థాయిలో సమీక్షించాలని, సంబంధిత దృశ్యాలను తొలగించాలని ఆదేశించింది. శాటిలైట్ టీవీ లైసెన్సుదారులందరూ పీఈఎంఆర్‌ఏ నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలని, అశ్లీల సన్నివేశాలను ప్రచారం చేయవద్దని స్పష్టం చేసింది. మరోవైపు ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. పరువు హత్యలు, మహిళలపై వేధింపులు తదితర అంశాలను పట్టించుకోని పాకిస్థాన్ ప్రభుత్వం.. కొంతమంది స్పందనను పరిగణనలోకి తీసుకుందని విమర్శిస్తున్నారు. పాక్‌కు చెందిన మానవహక్కుల కార్యకర్త రీమా ఒమర్ స్పందిస్తూ.. ‘హింస, మహిళలపై వేధింపుల కంటే వివాహిత జంటల మధ్య సాన్నిహిత్యం, ఆప్యాయతలు, ప్రేమల వల్ల పాకిస్థాన్ సమాజానికి ఇబ్బంది లేదు.. అసూయతో మన సంస్కృతిపై నియంత్రణ విధించకుండా మనం కాపాడుకోవాలి’ అని ఆమె అన్నారు. అయితే, ఇటీవల విడుదలైన కొత్త టీవీ సీరియల్ జుడా హౌ కుచ్ టీజర్‌పై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.


By October 24, 2021 at 08:44AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/pakistan-asks-tv-channels-to-ban-hug-scenes-says-disregard-to-culture/articleshow/87233627.cms

No comments