కృష్ణ వంశీకి మెగా సాయం.. థాంక్స్ చెప్పిన క్రియేటివ్ డైరెక్టర్... అంత టైమ్ ఎక్కడుందంటున్న ఫ్యాన్స్
‘గులాబీ, నిన్నే పెళ్లాడతా, అంతఃపురం, మురారి’.. వంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రాలతో క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు కృష్ణ వంశీ. అంటే కృష్ణవంశీకి ఎంతో అభిమానం. అన్నయ్య అని ఆప్యాయంగా పిలుచుకుంటూ ఉంటారు. చిరంజీవి కూడా కృష్ణవంశీని అదెలా ఆదరిస్తుంటారు. ‘గోవిందు అందరివాడేలే’ సినిమాను కృష్ణవంశీ డైరెక్ట్ చేయడానికి మెగాస్టారే కారణం. ఈ విషయాన్ని కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కథ కూడా వినకుండా కృష్ణవంశీతో సినిమా చేయమని రామ్‌చరణ్‌కు చెప్పారట చిరంజీవి. ఇద్దరి మధ్య అంత మంచి బాండింగ్ ఉంది. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ‘నక్షత్రం’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అప్పటి నుంచి ఈ డైరెక్టర్ మరో సినిమాను డైరెక్ట్ చేయలేదు. దాదాపు నాలుగేళ్ల తర్వాత కృష్ణ వంశీ దర్శకత్వంలో డిఫరెంట్ మూవీగా ‘రంగ మార్తాండ’ రూపొందుతోంది. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ‘రంగమార్తాండ’లో పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ఓ మంచి వాయిస్ అవసరం అయ్యింది. దీంతో కృష్ణవంశీ, చిరంజీవిని కలిసి తన చిత్రానికి వాయిస్ ఓవర్ కావాలని అడిగారట. కృష్ణవంశీపై ఉన్న ప్రేమతో చిరంజీవి కూడా వెంటనే ఓకే చెప్పారట. ఇప్పుడు ఆయన రంగమార్తాండ కోసం డబ్బింగ్ చెప్పే పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. ఈ విషయాన్ని కృష్ణవంశీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్న ఫొటోను షేర్ చేశారు. ‘‘థాంక్యూ అన్నయ్య.. మీది ఎంతో మంచి మనసు. నా రంగమార్తాండకు మీ మెగావాయిస్ ఓవర్ ఇవ్వడం మీ గొప్పతానికి నిదర్శనం. రంగమార్తాండలో మీ వాయిస్ మరో కలికితురాయి అవుతుంది’’ అన్నారు. ఆ ఫొటోను చూసి మెగా ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు.. మెగాస్టార్ వాయిస్ ఓవర్ సినిమాకు కచ్చితంగా ప్లస్ అవుతుందన్నారు. అసలు ఇంత బిజీగా ఉన్న సమయంలోనూ ఇలాంటి సాయం చేస్తున్నారు..అసలు మీకెక్కడ టైమ్ దొరుకుతుందంటూ చిరంజీవిని అప్రిషియేట్ చేస్తున్నారు. మరాఠీలో ఘన విజయం సాధించిన చిత్రం ‘నట సామ్రాట్’ చిత్రానికి ఇది రీమేక్. మరాఠీలో నానా పటేకర్ పాత్రను తెలుగులో ప్రకాశ్ రాజ్ పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివానీ రాజశేఖర్, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలనేది కృష్ణవంశీ ఆలోచనగా కనిపిస్తుంది. మరి ఈ రంగమార్తాండ క్రియేటివ్ డైరెక్టర్‌ను మళ్లీ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.
By October 26, 2021 at 02:06PM
No comments