Breaking News

నడి రోడ్డుపై 'జాతి రత్నాలు' హీరోయిన్ హల్చల్.. ఆపుకోలేకపోయానంటూ ఓపెన్ అయిన బ్యూటీ.. వీడియో వైరల్


మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన .. ‘జాతిరత్నాలు' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి కుర్రకారు మనసు దోచుకుంది. 'చిట్టి'గా వెండితెరపై తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించి ఫస్ట్ మూవీతోనే ఫుల్ పాపులర్ అయింది ఈ లోకల్ బ్యూటీ. చిత్రంలో నవీన్ పోలిశెట్టి లవర్‌గా ఫరియా చూపిన హావభావాలు యూత్ గుండెల్లో అలా నిలిచిపోయాయి. వెండితెరపై అలా ఫిదా చేసిన ఈ బ్యూటీ.. ఇటు సోషల్ మీడియాలోనూ అదే రేంజ్‌లో ఆకట్టుకుంటోంది. ఆఫర్ల సంగతి పక్కనబెడితే ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోస్‌తో తెగ అట్రాక్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా ఫరియా పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. బేసికల్ గానే డాన్స్ అంటే ఎంతో ఇష్టపడే ఈ చిన్నది.. నడి రోడ్డుపై చిందులేసి అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది. పూర్తి సంప్రదాయ వస్త్రాధారణలో కనిపించిన ఆమె, డ్రమ్ బీట్‌కి తగ్గట్టుగా తీన్మార్ స్టెప్పులేసింది. ఈ వీడియోని ఆమెనే స్వయంగా పోస్ట్ చేయడంతో వెంటనే వైరల్ అయింది. అయితే ఈ వీడియో పంచుకుంటూ తన మనసులోని మాట బయటపెట్టింది ఫరియా అబ్దుల్లా. ''డ్రమ్స్ శబ్దం వస్తుంటే ఆపుకోలేక పోయా.. న‌న్ను నేను కంట్రోల్ చేసుకోవడం కష్టం అయింది. డ్ర‌మ్ ప‌వ‌ర్ అదే'' అంటూ మ్యూజిక్, డాన్స్ అంటే తనకెంత ఇష్టమో చెప్పేసింది. తొలి సినిమాతోనే ఫ్యాన్ బేస్ ఫుల్లుగా పెంచుకున్న ఫరియాకు వరుస ఆఫర్స్ వస్తున్నాయట. అయితే సెలెక్టెడ్ రోల్స్ ఆమె ఎంచుకుంటోందట. రీసెంట్‌గా ఆమె 'ఢీ' సిక్వెల్‏లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.


By October 07, 2021 at 09:28AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/faria-abdullah-latest-dance-video-viral-on-social-media/articleshow/86829673.cms

No comments