Breaking News

కూతురిపై తండ్రి అత్యాచారం.. న్యాయకోరుతూ కోర్టులో తల్లి ఆత్మహత్యాయత్నం


కంటి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కుమార్తెపై అత్యాచారానికి పాల్పడటంతో ఓ మహిళ తన నిస్సాహయతకు బాధపడుతూ కోర్టులోనే ఆత్మహత్యయాత్నం చేసింది. ఈ ఘటన పాకిస్థాన్‌లోని లాహోర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. తన కూతురిపై అత్యాచారానికి పాల్పడిన భర్తపై కేసు పెట్టేందుకు తన వద్ద డబ్బులు లేవని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణానికి ప్రయత్నించింది. బాధిత మహిళ ఈ ఏడాది జులైలో ఇచ్చిన ఫిర్యాదుతో భర్తను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తాత్కాలికంగా విడిపోయిన ఈ దంపతులకు ఐదుగురు పిల్లలు కాగా.. తండ్రితో పాటు ఉంటున్న వారి ముగ్గురు కూతుళ్లలో ఒకరిపై అతడు అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏడాది నుంచి 15 ఏళ్ల వయసున్న కుమార్తెపై అత్యాచారం చేస్తున్నాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. అఘాయిత్యానికి పాల్పడటమే కాదు, దీని గురించి బయటపెడితే చంపేస్తానని కుమార్తెను బెదిరించాడని ఆరోపించింది. దీంతో నిందితుడ్ని జులై 8న లాహోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైల్లో ఉన్న నిందితుడు బయటకు వచ్చిన తర్వాత కుమార్తెలందరిపై అత్యాచారానికి పాల్పడతానని భర్త బెదిరించడంతో ఆమె భయాందోళనకు గురయ్యింది. అతడిపై న్యాయపోరాటానికి అవసరమైన డబ్బులేదని కలత చెందుతూ లాహోర్ సెషన్స్ కోర్టు వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. అయితే, అక్కడ ఉన్నవారు సకాలంలో స్పందించి అడ్డుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. మహిళ ఆత్మహత్యాయత్నంపై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి హబీబుల్లా అమీర్ తీవ్రంగా పరిగణించారు. ఘటనపై విచారణకు ఆదేశించిన ఆయన.. దర్యాప్తు అనంతరం నివేదికను సమర్పించాలని న్యాయస్థంన సెక్యూరిటీ ఇంఛార్జ్‌కు సూచించారు. కోర్టులో మహిళ ఆత్మహత్యయత్నం చేయడం కలకలం రేగుతోంది. కాగా, పాక్‌లో ఇటీవల మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయడానికి పాక్ ప్రభుత్వం కఠిన చట్టం తీసుకొచ్చింది.


By October 28, 2021 at 11:12AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-attempts-suicide-at-court-in-pakistan-after-husband-rapes-daughter/articleshow/87327730.cms

No comments