Breaking News

పునీత్ రాజ్‌కుమార్‌కు బాల‌కృష్ణ నివాళి.. త‌ల కొట్టుకుని.. క‌న్నీళ్లు పెట్టుకున్న నంద‌మూరి హీరో


క‌న్న‌డ ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు పునీత్ రాజ్ కుమార్ మ‌ర‌ణం సినీ ప‌రిశ్ర‌మ‌ను శోక సంద్రంలో ముంచేసింది. ముఖ్యంగా పునీత్‌కు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోని స్టార్స్‌తో మంచి అనుబంధాన్ని ఏర్ప‌రుచుకున్నారు. శ‌నివారం కంఠీర‌వ మైదానంలో పార్థివ దేహాన్ని ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం ఉంచారు. ప్ర‌జ‌లు ల‌క్ష‌ల్లో పునీత్ పార్థీవ దేహాన్ని సంద‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలో టాలీవుడ్ సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుడు నంద‌మూరి బాల‌కృష్ణ పునీత్ రాజ్‌కుమార్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. పునీత్ రాజ్‌కుమార్ సోదరుడు శివ రాజ్‌కుమార్ ఈ నేప‌థ్యంలో బాల‌కృష్ణ చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు. క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఇదంతా విధిరాత అంటూ త‌ల కొట్టుకుని త‌న భావోద్వేగాన్ని ప్ర‌ద‌ర్శించారు. బాల‌కృష్ణ‌తో నిర్మాత సాయి కొర్ర‌పాటి ఉన్నారు. తెలుగు చిత్ర‌సీమంటే క‌న్న‌డ కంఠీర‌వ రాజ్‌కుమార్ ఫ్యామిలీకి ఎంతో ఇష్టం. మ‌న నటీనటుల‌ను ఎంత‌గానో ఆద‌రించేవారు. పునీత్ రాజ్‌కుమార్ విష‌యానికి వ‌స్తే.. వారి ఫ్యామిలీలో టాలీవుడ్ ఇండ‌స్ట్రీతో అంద‌రికంటే ఆయ‌నే ఎక్కువ స్నేహ సంబంధాల‌ను ఏర్ప‌రుచుకున్నారు. ఇక్క‌డి నుంచి ఏ హీరో బెంగుళూరు వెళ్లినా, పునీత్ వెళ్లి ప్ర‌త్యేకంగా క‌లిసి మాట్లాడేవారు. అలాంటి వ్య‌క్తి ఉన్న‌ట్లుండి దూరం కావ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ముఖ్యంగా నంద‌మూరి ఫ్యామిలీతో పునీత్‌కు చాలా మంచి స్నేహ బంధం ఉంది. ఆ మ‌ధ్య‌లో బాల‌కృష్ణ త‌న‌ సినిమా ప్ర‌మోష‌న్స్‌కు బెంగుళూరు వెళ్లిన‌ప్పుడు పునీత్ ఆయ‌న ప‌క్క‌నే కూర్చున్నారు. బాల‌కృష్ణ ముఖంపై ఏదో ఉంటే త‌న ఖ‌ర్చీఫ్ తీసుకుని దాన్ని శుభ్రం చేశారు. తానో పెద్ద హీరోన‌నే ఫీలింగ్‌ను ఎక్క‌డా చూపించేవారు కాదు పునీత్‌. ఆర్య సినిమా చూసి బన్నీకి స్పెషల్‌గా ఫోన్ చేసి మాట్లాడారంటే ఆయన మంచితనం, కలుపుగోలుతనం అర్థం చేసుకోవచ్చు. అలాగే చరణ్‌తో ఫ్రెండ్లీగా ఉండేవారు. అదే అంద‌రికీ ఆయ‌న్ని చాలా ద‌గ్గ‌ర చేసింద‌ని అందరూ అంటారు. పునీత్‌లాంటి ఓ మంచి వ్య‌క్తిని, స్నేహ‌శీలిని కోల్పోవ‌డం సినీ ఇండ‌స్ట్రీకి పెద్ద లోటే. కేవ‌లం సినిమాల‌తోనే కాదు, ఎంతో మంది ఆప‌న్నుల‌కి అండ‌గా నిలిచి త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆర్థిక సాయాన్ని అందించారు. చిన్న పిల్ల‌లు, అనాథ పిల్ల‌ల‌కు విద్య‌ను అందిస్తున్నారు పునీత్‌. అలాంటి వ్య‌క్తి ఉన్న‌ట్లుండి దూర‌మ‌వ‌డం అంద‌రికీ షాకింగ్‌గా అనిపిస్తుంది. సినీ సెల‌బ్రిటీలంద‌రూ త‌మ‌న సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. పునీత్ రాజ్‌కుమార్‌ పార్థివ దేహాన్ని కంఠీర‌వ స్టేడియంలో అక్క‌డ ప్ర‌జ‌ల సంద‌ర్శనార్థం ఉంచారు. శ‌నివారం సాయంత్రం అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయి. ప్ర‌స్తుతం పునీత్ రాజ్‌కుమార్ కుమార్తె అమెరికాలో ఉన్నారు. అక్క‌డ నుంచి ఆమె శ‌నివారం బెంగ‌ళూరుకి చేరుకుంటారు. ఆమె తుది చూపు చూసిన త‌ర్వాత పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు జరుగుతాయి.


By October 30, 2021 at 12:14PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nandamuri-balakrishna-tributes-paid-to-puneeth-rajkumar/articleshow/87389282.cms

No comments