భార్యతో కలిసి మహేష్ తొలిసారిగా అలా.. స్టైలిష్ లుక్‌లో అదరగొడుతున్న స్టార్ కపుల్
సూపర్‌స్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. ఆయన కుటుంబానికి కేటాయించాల్సిన సమయాన్ని కచ్చితంగా కేటాయిస్తారు. సినిమాల నుంచి బ్రేక్ దొరికినప్పుడల్లా.. తన భార్య , పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఆయన విదేశాలకు విహారయాత్రలకు వెళ్తుంటారు. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం కరోనా ఉంటడంతో.. ఖాళీ సమయాల్లో ఎక్కువగా ప్రయాణాలు చేయకుండా.. ఇంట్లోనే ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు మహేష్. ఇక మహేష్ మరియు నమ్రతలది ప్రేమ వివాహం అన్న విషయం అందరికి తెలిసిందే. ‘వంశీ’ అనే సినిమాలో కలిసి నటించిన వీరిద్దరు.. ఆ సినిమాతోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎలాంటి విబేధాలు లేకుండా.. అన్యోన్యంగా ఉంటూ.. అదర్శ జంటగా నిలిచారు వీరిద్దరు. ఇక మహేష్‌బాబు సామాజిక సేవా పనులు.. ఇతర వ్యవహారాలు అన్ని నమ్రతనే దగ్గరుండి చూసుకుంటారు. ఆయనకు సంబంధించిన అప్‌డేట్స్ అన్ని ఆమె ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా అందిస్తుంటారు. అయితే తొలిసారిగా మహేష్ మరియు నమ్రతలు కలిసి ఓ ఫోటోషూట్ నిర్వహించారట. ప్రముఖ సినీ మ్యాగజైన్ ‘హలో’ కోసం వీరిద్దరు స్టైల్‌లుక్‌లో ఈ ఫోటోషూట్‌లో పాల్గొన్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆ మ్యాగజైన్ కవర్ పేజ్ ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలు ముగిసిన తర్వాత ఆయన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
By October 01, 2021 at 08:00AM
No comments