Allu Arjun: ఆమెలో బాగా నచ్చేది అదొక్కటే.. యంగ్ హీరోయిన్‌పై అల్లు అర్జున్ ఓపెన్ కామెంట్స్
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/87327165/photo-87327165.jpg)
నాగ శౌర్య, హీరోహీరోయిన్లుగా అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా 'వరుడు కావలెను'. నూతన దర్శకురాలు లక్ష్మి సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతూ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గత రాత్రి హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్, వేదికపై తమ మాటలతో హూషారెత్తించారు. ఈ సందర్భంగా యంగ్ హీరోయిన్ రీతూ వర్మ గురించి అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ హైలైట్ అయ్యాయి. వరుడు కావలెను చిత్రంలోని పాటలు తన ఇంట్లో కూడా ఎప్పుడూ వినిపిస్తుంటాయని, ముఖ్యంగా 'దిగు దిగు దిగు నాగ' సాంగ్ అయితే అర్హకు చాలా ఇష్టమని, ఇంట్లో ఆ పాట ఎప్పుడూ మోగుతూనే ఉంటుందని చెబుతూ హీరోయిన్ రీతూ వర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్. 'పెళ్లిచూపులు' సినిమా చూడగానే రీతూ వర్మ నచ్చేసిందని, ఆ మూవీ చూసిన వెంటనే రీతూ వర్మ గురించి కనుక్కున్నానని అన్నారు. ఆమెలోని హుందాతనం తనకు బాగా నచ్చుతుందని చెప్పారు బన్నీ. ఇకపోతే ఈ మూవీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్యకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పిన అల్లు అర్జున్.. ఓ మహిళ సినిమాకు దర్శకత్వం వహించడం అభినందనీయం అన్నారు. అలాగే ఇంకా చాలామంది మహిళలు చిత్ర పరిశ్రమకి రావాలని అన్నారు. ముంబైలో సినిమా చేసేటప్పుడు సెట్లో 50శాతం అమ్మాయిలే కనిపిస్తుంటారు. మన దగ్గర ఎప్పుడు అలా కనిపిస్తారా అనుకుంటుంటాం. ఇక ఆ రోజుల వచ్చాయని నమ్ముతున్నా అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. అలాగే హీరో గురించి మాట్లాడిన బన్నీ.. సెల్ఫ్ మేడ్ పీపుల్ అంటే తనకు చాలా ఇష్టమని, అలా ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చి నాగ శౌర్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. భవిష్యత్‌లో ఆయన చాలా పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు అల్లు అర్జున్.
By October 28, 2021 at 10:47AM
No comments