Breaking News

ఫేస్‌బుక్‌కు షాకిచ్చిన బ్రిటన్.. అలా చేయలేదని రూ.500 కోట్లపైగా భారీ జరిమానా


ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. తాము కోరిన వివరాలను సమర్పించడంలో విఫలమైదంటూ బ్రిటన్‌ కాంపీటీషన్‌ రెగ్యులేటర్‌ భారీ జరిమానా విధించింది. ఈ విషయంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించినందుకు రూ.515 కోట్ల (50.5 మిలియన్‌ పౌండ్లు) జరిమానా చెల్లించాలని ఆదేశించినట్లు తెలిపింది. ఏ సంస్థ అయినా చట్టానికి లోబడి ఉండాల్సిందేనన్న హెచ్చరిక పంపించాలన్న విధానాల మేరకు ఈ జరిమానా విధించినట్లు స్పష్టం చేసింది. యూనిమేటెడ్‌ సంస్థ జిఫీని గతేడాది జూన్‌లో ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది. జిఫీని చేజిక్కించుకోవడం ద్వారా సోషల్ మీడియా మధ్య పోటీని ఫేస్‌బుక్‌ నియంత్రిస్తోందన్న ఆరోపణలపై బ్రిటన్‌ కాంపీటీషన్‌ అండ్‌ మార్కెట్స్‌ అథారిటీ (సీఎంఏ) విచారణ చేపట్టింది. ఈ ఆరోపణలపై వివరాలను అందజేయాలని పలుమార్లు కోరినప్పటికీ వాటిని సమర్పించడంలో ఫేస్‌బుక్‌ ఉద్దేశపూర్వకంగానే వెనుకడుగు వేసిందని పేర్కొంది. ‘ఫేస్‌బుక్ సమ్మతి గురించి రెగ్యులర్ అప్‌డేట్‌లను రెగ్యులేటరీకి అందించాల్సి ఉంది.. అయితే, ఈ నిబంధనల పరిధిని గణనీయంగా పరిమితం చేసింది.. పదేపదే హెచ్చరికలు చేసినప్పటికీ వాటిని పాటించడంలో వైఫల్యం ఉద్దేశపూర్వకంగానే జరిగింది’ అని నిర్ధారించినట్లు సీఎంఏ తెలిపింది. ఒక సంస్థ ప్రారంభ అమలు ఉత్తర్వులను ఉల్లంఘించడం ఇదే మొదటిసారి ఫేర్కొంది. ‘మాకు ముఖ్యమైన సమాచారాన్ని అందించడానికి నిరాకరించడం ఉల్లంఘించడమేనని ఫేస్‌బుక్‌ను హెచ్చరించాం.. కానీ, రెండు వేర్వేరు కోర్టులలో అప్పీల్‌ను కోల్పోయిన తర్వాత కూడా ఆ సంస్థ తన చట్టపరమైన బాధ్యతలను విస్మరిస్తూనే ఉంది’ సీఎంఏ సీనియర్ డైరెక్టర్ జోయెల్ బామ్‌ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘చట్టాన్ని అతిక్రమించినట్టు భావించే ఏదైనా కంపెనీకి హెచ్చరికగా ఇది ఉపయోగపడుతుంది’ అని బామ్‌ఫోర్డ్ జోడించారు. అత్యుత్తమ ప్రయత్న సమ్మతి విధానం కోసం ఫేస్‌బుక్‌ను శిక్షించే అన్యాయమైన నిర్ణయంతో "గట్టిగా" విభేదిస్తున్నట్లు ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, సీఎంఏ నిర్ణయంపై ఫేస్‌బుక్‌ స్పందిస్తూ.. తాము తీవ్రంగా విభేదిస్తున్నామని పేర్కొంది. సీఎంఏ నిర్ణయంపై సమీక్షించి తదుపరి అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది. ఇప్పటికే తమతో సంప్రదించకుండా రెండు వేర్వేరు సందర్భాల్లో చీఫ్ కంప్లియన్స్ ఆఫీసర్లను మార్చడంపై ఫేస్‌బుక్‌కు జరిమానా వేసింది.


By October 21, 2021 at 09:36AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/facebook-fined-70-million-by-uk-for-deliberate-failure-to-comply-with-regulator/articleshow/87175956.cms

No comments