Superstar Mahesh: సూపర్‌స్టార్ మహేశ్ వాడిన తొలి మొబైల్ మోడల్ ఏంటో తెలుసా?
సూపర్‌స్టార్ మహేశ్ తెలుగు సినిమా తెరపై సినిమాలతో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేక్షకాభిమానుల్లో ఆయన సినిమాలకు ఉండే క్రేజే వేరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సూపర్‌స్టార్ కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇరవైకి పైగా కమర్షియల్ యాడ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నటిస్తున్న మహేశ్ రీసెంట్‌గా ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ బిగ్ సికు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. దానికి సంబంధించిన ప్రమోషనల యాక్టివిటీలో మహేశ్ పాల్గొన్నారు. రీసెంట్‌గా బిగ్‌సికి సంబంధించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్ ఆసక్తికరమైన విషయాలను కొన్నింటిని తెలియజేశారు. మీరు ఉపయోగించిన తొలి మొబైల్ ఫోన్ మోడల్ ఏంటి? అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ‘నోకియా క్లాసికల్ మోడల్’ అని బదులిచ్చారు. అలాగే మీరు సెల్ఫీ తీసుకోవాలని అనుకుంటే ఎవరితో తీసుకోవాలనుకుంటారు? అనే ప్రశ్నకు వెంటనే మా నాన్న అని బదులిచ్చారు మహేశ్. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ సినిమాను పూర్తి చేయడంలో మహేశ్ ఫుల్ బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది పూర్తయిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి మహేశ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్న జక్కన్న ఇప్పుడు మహేశ్ కోసం కథను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు.
By September 25, 2021 at 09:44AM
No comments