Breaking News

Salaar: ముంబైలో డైరెక్టర్‌తో శృతి హాసన్ ఎంజాయ్.. విసిగిస్తున్నా అంటూ పోస్ట్! వీడియో వైరల్


ప్రేమ వ్యవహారాలతో సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ .. రీసెంట్‌గా క్రాక్ సినిమాలో రవితేజ సరసన నటించి హిట్ పట్టేసింది. ఆ తర్వాత ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన '' అనే భారీ సినిమాలో భాగమవుతోంది శృతి. గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సెట్స్‌పై సరదాగా ఎంజాయ్ చేసిన ఓ వీడియోను షేర్ చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది శృతి హాసన్. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే శృతి.. సలార్ సెట్‏లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్‏ను ఆట పట్టిస్తున్న వీడియో పోస్ట్ చేసింది. నాకిష్టమైన పని చేస్తూ నాకిష్టమైన డైరెక్టర్‌ని ఏడిపిస్తున్నా, ఆయనకు విసుగు తెప్పిస్తున్నా అంటూ ఈ వీడియో పోస్ట్ చేసింది శృతి. షూటింగ్ చేస్తుండగా ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఫోన్ పట్టుకొని ఎంజాయ్ చేసే శృతి హాసన్, అదే తన ఇష్టమైన పని అంటూ ఇలా ఈ వీడియో పోస్ట్ చేసింది. 'కేజీఎఫ్' సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్‌గా భారీ క్రేజ్ అందుకున్న ఈ 'సలార్' సినిమా కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై భారీ రేంజ్‌లో రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. చిత్రాన్ని 2022 సంవత్సరం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.


By September 15, 2021 at 04:20PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/salaar-shruti-haasan-enjoyed-with-director-prashanth-neel/articleshow/86228247.cms

No comments