ఆ మానవ మృగం చేతిపై మౌనిక పచ్చబొట్టు.. పట్టించిన వాళ్లకి రివార్డ్ ప్రకటించిన ఆర్పీ పట్నాయక్.. పది లక్షలతో పాటు ఇది కూడా
హైదరాబాద్‌లోని ప్రాంతంలోని సింగరేణి కాలనీలో కొన్ని రోజుల క్రితం దారుణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ముక్కుపచ్చలారిని ఓ చిన్నారిపై ఓ కిరాతకుడు దారుణంగా హత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సాగర్ రహదారిపై దాదాపు 7 గంటల పాటు బైఠాయించిన స్థానికులు.. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే ఘటన జరిగిన రోజు నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకొనేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా నిందితుడి ఆచూకీ తెలిపిన వాళ్లకు 10 లక్షల రూపాయిల నజరానా ఇస్తామని కూడా పోలీసులు ప్రకటించారు. అతని ఎత్తు, వయన్సు, ఎలా ఉంటాడో అనే అనవాళ్లు వాళ్లు వెల్లడించారు. అయితే పోలీసులు ఎంత పటిష్టంగా గాలిస్తున్నారో.. నిందితుడు రాజు కూడా అంతే తెలివిగా వారి నుంచి తప్పించుకుంటున్నాడు. పోలీసులు విడుదల చేసిన ఆచూకీలు బయటకు కనిపించకుండా అతను జాగ్రత్తలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులతో పాటు.. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు .. ఈ నిందితుడిని పట్టుకున్న వారికి పారితోషికం ప్రకటించారు. నిందితుడి వివరాలు షేర్ చేసిన ఆర్‌పీ.. నిందితుడి ఆచూకి తెలిపిన వాళ్లకు రూ.50 వేలు నజరానా ఇస్తానని పేర్కొన్నారు. ‘‘చిట్టితల్లికి న్యాయం జరగాలంటే, ఆమె ఆత్మ శాంతించాలంటే, ఈ పల్లకొండ రాజు దొరకాలి. హైదరాబాద్ సిటీ పోలీస్ విడుదల చేసిన ఈ ఆధారాల ద్వారా ఈ నిందితుడిని పట్టుకున్న వారికి 10 లక్షలు రివార్డు ప్రకటించారు. నా వంతుగా ఆ పట్టించిన వారికి రూ.50 వేలు ఇస్తాను. కానీ ఇతను దొరకాలి.. పోలీసులు ఇచ్చిన అన్ని క్లూస్ మనకి హెల్ప్ కావొచ్చు, కాకపోవచ్చు.. కానీ చేతిపై ‘మౌనిక’ అనే పచ్చబొట్టు తప్పకుండా అతన్ని పట్టించేలా చేస్తుంది. అతను మీ దగ్గర్లోనే ఉండొచ్చు. ఒక కన్ను వేసి ఉంచండి. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి ఈ నేరస్తుడిని పట్టుకునే పనిలో మనం కూడా సహకరిద్దాం’’ అంటూ ఆయన పోస్ట్ చేశారు.
By September 15, 2021 at 03:15PM
No comments