Sai Pallavi: చిరంజీవిపై సాయి పల్లవి కామెంట్స్.. అందుకే అలా మాట్లాడారంటూ ఓపెన్
కరోనా దెబ్బకు విలవిల్లాడిన థియేటర్స్ ఇప్పుడిప్పుడే కొత్త శోభ సంతరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా సెకండ్ వేవ్ తరువాత థియేటర్లలోకి రాబోతోన్న పెద్ద సినిమా ''. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో నాగ చైతన్య, జంటగా నటించారు. సెప్టెంబర్ 24న ఈ సినిమాను గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్న చిత్రయూనిట్ బెస్ట్ ప్రమోషన్స్ చేస్తోంది. ఇందులో భాగంగా రీసెంట్‌గా హైదరాబాద్‌లో చిరంజీవి, అమీర్ ఖాన్ ముఖ్య అతిథులుగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో సాయి పల్లవిపై మెగాస్టార్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఆమెతో కలిసి పోటీపడి డాన్స్ చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టారు చిరు. ఆ తర్వాత సాయి పల్లవితో వేదికపై ఓ చిన్న స్టెప్ కూడా వేశారు. అయితే తాజాగా ఓ మీడియాలో ముచ్చటించిన సాయి పల్లవి ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. చిరంజీవి గారిది పెద్ద మనసు అని, అందుకే డ్యాన్స్ బాగా చేస్తావని కితాబిచ్చారని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. తనతో డ్యాన్స్ చేయాలని ఉందని సరదాగా అన్నారని చెప్పిన ఆమె.. తన డ్యాన్స్ చూసి ప్రేక్షకులు సంతోషపడితే అదే చాలని తెలిపింది. ఇకపోతే తనకంటే బాగా డ్యాన్స్ చేసేవాళ్లు కూడా ఉంటారని, ఛాన్స్ వస్తే వాళ్లూ నిరూపించుకుంటారని చెబుతూ అప్‌కమింగ్ యాక్టర్లకు, డాన్సర్లకు బూస్టింగ్ ఇచ్చింది సాయి పల్లవి. ఫీల్ గుడ్ 'లవ్ స్టోరీ'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'లవ్ స్టోరీ' సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, 'సారంగా దరియా' సాంగ్, టీజర్, ట్రైలర్‌లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.
By September 23, 2021 at 09:07AM
No comments