Sai Dharam Tej: ఇది కఠిన సమయం.. హాస్పిటల్ లోపలి పరిస్థితిపై నిఖిల్ కామెంట్స్ వైరల్
మెగా మేనల్లుడు బైక్ యాక్సిడెంట్ ఇష్యూపై ఓ రేంజ్‌లో వార్తలు వస్తున్నాయి. ఆయన బైక్ ఏంటి? ఎలా స్కిడ్ అయింది? ఎంత స్పీడ్ వెళ్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇలా పలు కోణాల్లో వార్తా విశ్లేషణలు వస్తుండగా.. మరోవైపు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై మీడియా వర్గాలు ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతున్నాయి. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ శస్త్ర చికిత్స విషయమై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆసుపత్రిలో సాయి ధరమ్ తేజ్‌కు చికిత్స చేస్తున్న వీడియోలు బయటకు రావడం చూశాం. అయితే ఈ వీడియోలపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిఖిల్.. ఇది చాలా బాధాకరం అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి కఠిన సమయంలో ప్రైవసీ చాలా ముఖ్యమని అన్నారు. అసలు ఐసీయూలోకి కెమెరాను ఎవరు అనుమతించారు? కెమెరా ఎలా వెళ్తుంది అని ప్రశ్నించారు. ఓ వ్యక్తి ప్రైవసీకి దయచేసి గౌరవం ఇవ్వండి అంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై నెటిజన్స్ పాజిటివ్ రియాక్షన్ ఇస్తున్నారు. బైక్ యాక్సిడెంట్ జరిగాక తీవ్రగాయాలతో ఉన్న సాయి ధరమ్ తేజ్‌ని ముందుగా మెడికోవర్ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి అపోలో షిఫ్ట్ చేశారు. అపోలో వైద్యుల సమక్షంలో సాయితేజ్ చికిత్స పొందుతున్నారు. ఆదివారం రోజు ఆయనకు కాలర్ బోన్ శస్త్ర చికిత్స పూర్తి చేసిన వైద్యులు.. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ అప్‌డేట్ ఇచ్చారు. మరోవైపు సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు పూజలు చేస్తుండటం గమనార్హం.
By September 14, 2021 at 08:40AM
No comments