RRR - Ntr: ‘ఆర్ఆర్ఆర్’రీ షూట్... ఎన్టీఆర్ ట్రాక్ రాజమౌళికి నచ్చలేదా!
మోస్ అవెయిటెడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘’. గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్.. మన్నెందొర అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ సినిమా షూటింగ్ అంతా కూడా పూర్తయ్యిందని చిత్ర యూనిట్ ప్రకటించారు. దసరాకు విడుదల చేద్దామని అనుకున్న సినిమా కాస్త వచ్చే ఏడాది జనవరికి చేస్తారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు రిలీజ్‌డేట్ విషయంలో మార్పు తప్పదని, వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదలవుతుందని టాక్ వినిపిస్తోంది. అందుకు ప్రధాన కారణం రీషూట్ అని అంటున్నారు. సాధారణంగా రాజమౌళి తను అనుకున్న ఔట్‌పుట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాడు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ విషయంలోనూ అదే జరిగిందట. ఈ చిత్రంలో ఎన్టీఆర్, బ్రిటీష్ బ్యూటీ ఒలివియా మోరిస్ మధ్య ప్రేమకథ ఉంటుంది. ఆ పార్ట్ రాజమౌళికి నచ్చలేదు. దాంతో ఆ పార్ట్‌ను రీషూట్ చేస్తున్నాడని, అందుకనే వచ్చే ఏడాది జనవరి అనుకున్న ఈ సినిమా సమ్మర్‌కు వెళ్లిందని టాక్ వినిపిస్తోంది. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లకు సంబంధించిన ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామానే ‘ఆర్ఆర్ఆర్’. భారీ బడ్జెట్‌తో దానయ్య నిర్మిస్తోన్న ఈ పాన్ ఇండియా మూవీలో అజయ్ దేవగణ్, ఆలియా భట్ వంటి బాలీవుడ్ స్టార్స్, రే స్టీవెన్ సన్, ఓలివియా మోరిస్, అలిసన్ డూడి వంటి హాలీవుడ్ తారలు, కోలీవుడ్ నుంచి సముద్ర ఖని, శ్రియా శరన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాపై ఉన్న భారీ అంచనాలను అందుకునేలా సినిమాను రూపొందిస్తున్నాడు. మరోవైపు సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
By September 18, 2021 at 10:08AM
No comments