RR Venkat: టాలీవుడ్ నిర్మాత RR వెంకట్ కన్నుమూత
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/86546234/photo-86546234.jpg)
ఆర్ఆర్ మూవీ మేకర్స్ అధినేత, నిర్మాత వెంకట్ అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొన్ని రోజుల నుంచి ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. పరిస్థితి విషమించడంతో వెంకట్ చనిపోయారు. ఈయన ఇతరులతో కలిసి నిర్మాతగా సినిమాలు చేశారు. ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సోలోగానూ సినిమాలు చేశారు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్‌ల్లో సినిమాలు చేశారు. పైసా, ఆటోనగర్ సూర్య సహా పలు చిత్రాల నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించిన వెంకట్ ఢమరుకం, లవ్‌లీ, పూల రంగడు వంటి సినిమాలను తన ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు. హిందీలో ఏక్ హసీనా థీ, జేమ్స్.. ఇంగ్లీష్‌లో డివోర్స్ ఇన్విటేషన్ చిత్రాలను నిర్మించారు.
By September 27, 2021 at 09:01AM
No comments