Breaking News

RC 15: రామ్‌ చరణ్‌- శంకర్‌ ఫస్ట్‌ పోస్టర్‌ అదుర్స్.. భారీ ప్రాజెక్టుకు శ్రీకారం


'బాహుబలి' మూవీతో తెలుగు సినిమా ఖ్యాతి ఎల్లలు దాటింది. అప్పటినుంచి టాలీవుడ్‌లో భారీ రేంజ్ సినిమాలు ఊపందుకున్నాయి. స్టార్ హీరోలంతా వరుసపెట్టి పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. డైరెక్షన్‌లో రూపొందనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం నేడు (బుధవారం) ఉదయం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం తాజాగా ఓ పోస్టర్‌ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్‌తో పాటు , శంకర్‌, దిల్‌రాజు, ఇతర నటీనటులందరూ సూటుబూటు వేసుకుని ఫైల్స్‌ చేతబట్టుకుని వస్తున్నట్లు కనిపిస్తోంది. అందరూ కూడా ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. దీంతో ఇది చూసిన మెగా ఫ్యాన్స్ 'పోస్టర్‌ అదుర్స్' అంటూ కామెంట్స్ చేస్తూ తెగ షేర్ చేసుకుంటున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 50వ సినిమాగా, రామ్ చరణ్ 15వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. భారీ విజువల్ వండర్‌గా రూపొందించాలని, చెర్రీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ కావాలని మేకర్స్ ఫిక్సయ్యారట. చిత్రానికి ‘విశ్వంభ‌ర‌’ అనే టైటిల్‌ను పెట్ట‌బోతున్నట్లు సమాచారం. ఈ మూవీలో అంజలి, సునీల్‌, జయరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


By September 08, 2021 at 10:33AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rc-15-ram-charan-shankar-movie-offical-launch-poster-viral/articleshow/86028800.cms

No comments