Breaking News

Punjab CM చన్నీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. తొలగించాలని సోనియాకు NWC సంచలన లేఖ!


పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీని కాంగ్రెస్‌ పార్టీ నియమించడం పట్ల జాతీయ మహిళా కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయనను సీఎం పదవి నుంచి తప్పించాలని అధ్యక్షురాలు సోనియా గాంధీని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖాశర్మ కోరారు. మహిళా ఐఏఎస్‌ అధికారిని వేధించిన వ్యకి ముఖ్యమంత్రి కావడం సిగ్గుచేటని ఆమె వ్యాఖ్యానించారు. సాక్షాత్తు అధికారిణిని వేధించిన వ్యక్తి సీఎం అయితే.. రాష్ట్రంలో మహిళలకు భద్రత ఎలా ఉంటుందని ఆమె ప్రశ్నించారు అమరీందర్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న .. 2018లో తనకు అసభ్యకర మెసేజ్‌ పంపారంటూ ఓ మహిళా ఐఏఎస్‌ అధికారి ఆరోపించారు. దీనిని సుమోటాగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్‌ విచారణ చేపట్టింది. ఈ అంశంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ను తాను ఆదేశించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని రేఖాశర్మ ఆరోపించారు. ఈ ఆరోపణల్లో నిర్దోషిగా తేలేవరకూ ఆయనను సీఎం పదవిలో కొనసాగకుండా చూడాలని సోనియాను కోరారు. ‘మహిళ అధ్యక్షురాలిగా ఉన్న ఓ పార్టీ చరణ్‌జిత్ సింగ్ చన్నీని పంజాబ్ ముఖ్యమంత్రిగా చేసింది.. ఇది ఓ ద్రోహం.. మహిళ భద్రతకు ముప్పు.. ఆయనపై విచారణ జరిపించాలి.. ఒకవేళ ఆయన నిర్దోషిగా తేలకపోతే ముఖ్యమంత్రి పదవికి అనర్హులు.. ఆయనను పదవి నుంచి తొలగించాలని సోనియా గాంధీని అభ్యర్థిస్తున్నాను’ అని రేఖా శర్మ అన్నారు. ‘2018 నాటి మీటూ ఉద్యమం సమయంలో ఆయనపై ఆరోపణలు వచ్చాయి..ఈ అంశాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి, ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని ఛైర్మన్ ధర్నాకు దిగినా ప్రయోజనం లేకపోయింది’ అని అన్నారు. ‘బెదిరింపులకు పాల్పడినట్లు స్వయంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సీఎం అయితే మహిళల భద్రత ఎలా ఉంటుందో ఊహించవచ్చు.. రాష్ట్రంలో ఒక ఐఏఎస్ అధికారిణికి న్యాయం జరగకపోతే పంజాబ్‌లోని సాధారణ మహిళలు సురక్షితంగా ఉంటారని కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ధారిస్తుంది’ అని ధ్వజమెత్తారు.


By September 21, 2021 at 11:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/remove-charanjit-singh-channi-as-punjab-cm-nwc-chairperson-to-sonia-gandhi/articleshow/86389552.cms

No comments