Breaking News

Prabhas - Ntr: అందుకు ప్ర‌భాస్ ఒప్పుకుంటాడా? ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందేనా?


ప్ర‌భాస్‌ను ఓ విష‌యంలో ఒప్పించ‌డానికి కొంద‌రు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక ఎన్టీఆర్‌ను రంగంలోకి దింపాల‌ని అనుకుంటున్నారు. మ‌రి ప్ర‌భాస్ కోసం ఫీల్డ్‌లోకి వ‌స్తాడా? అనే విష‌యంలోకి వెళితే..యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు ‘ఆర్ఆర్ఆర్’ త‌ర్వాత నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేయ‌డానికి ఎలాగూ మూడు నాలుగు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. ఈ గ్యాప్‌లో బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు సంద‌డి ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు అనే కార్య‌క్ర‌మానికి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తొలి ఎపిసోడ్‌కు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ను హాట్‌సీట్‌ను కూర్చొని పెట్టాడు. దీంతో ప్రోగ్రామ్‌ను ర‌న్ చేస్తున్న స‌ద‌రు టీవీ ఛానెల్ టిఆర్‌పీ రేటింగ్స్ ఓ రేంజ్‌లో పెరిగింది. రీసెంట్‌గానే త‌న‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు చేసిన ద‌ర్శ‌కులు రాజ‌మౌళి, కొర‌టాల శివ‌ల‌ను కూడా హాట్ సీట్‌లో కూర్చొని పెట్టాడు. అప్పుడు కూడా మంచి టి.ఆర్‌.పి రేటింగ్స్ వ‌చ్చాయి. ఒక‌వైపు సామాన్యులు, మ‌రో వైపు సెల‌బ్రిటీల‌ను హాట్ సీట్లో కూర్చొని పెడుతూ త‌న ప్రోగ్రామ్‌కు క్రేజ్‌, టి.ఆర్‌.పి త‌గ్గ‌కుండా ఉండేలా నిర్వాహ‌కుల‌తో క‌లిసి తార‌క్ ప్లాన్ చేసుకుంటున్నాడు. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌ను కూడా ఈ హాట్‌సీట్‌లో క‌నిపించ‌బోతున్నాడు. స‌ద‌రు ప్రోగ్రామ్ కూడా ఆల్‌రెడీ షూట్ చేసేశారు. ద‌స‌రా సంద‌ర్భంగా ప్ర‌సారం చేయ‌బోతున్నారు. ఇప్పుడు తార‌క్ త‌న దృష్టిని పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌పై ఉంచాడు. సాధార‌ణంగా ఫంక్ష‌న్స్‌కు, స్టేజీల‌పై అద‌ర‌గొట్టే స్పీచులు ఇవ్వ‌డానికి పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డు. అలాంటిది హాట్ సీట్‌లో కూర్చుంటాడా? అనేది అంద‌రిలో మొద‌ల‌వుతున్న ప్ర‌శ్న‌. అయితే ఇప్ప‌టికే ప్ర‌భాస్‌ను ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు ప్రోగ్రామ్‌కు ర‌ప్పించ‌డానికి నిర్వాహ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. ఇక ఎన్టీఆర్ రంగంలోకి దిగి, ఓ ఫోన్ కొడితే వ్య‌వ‌హారం ఇంకా సులువు అవుతుంద‌ని, త్వ‌ర‌లోనే తార‌క్ ప్ర‌భాస్‌ను హాట్‌సీట్‌లోకి ర‌ప్పించ‌డానికి ఫోన్‌లో మాట్లాడ‌బోతున్నాడ‌ని అంటున్నారు. మ‌రి ప్ర‌భాస్ హాట్ సీట్‌లోకి వ‌స్తాడా? ఒక‌వేళ వ‌స్తే మాత్రం అదొక సెన్సేష‌న్ అని చెప్పొచ్చు.


By September 26, 2021 at 08:00AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/will-prabhas-agreet-to-attend-evaru-meelo-koteeswarulu-and-ntr-should-foray-into-field/articleshow/86522695.cms

No comments