Prabhas 25: ప్రభాస్ 25 కూడా ఫిక్స్.. మరోసారి అతనిపై నమ్మకం పెట్టుకున్న డార్లింగ్
పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు తన కెరీర్‌లో 25వ సినిమా చేయబోతున్నాడు. అయితే ఆ సినిమాను ఎవరు నిర్మిస్తారు? దర్శకత్వం ఎవరు వహిస్తారు? అనే దానిపై ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే లేటెస్ట్‌గా సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వైపు దృష్టి సారించి అక్కడ కూడా సినిమాలు తీస్తున్న నిర్మాత దిల్‌రాజు..మన బాహుబలి ప్రభాస్ 25వ సినిమాను నిర్మించబోతున్నాడు. చర్చలు కూడా పూర్తయ్యాయని టాక్ వినిపిస్తోంది. మరి దర్శకుడెవరు? ఇంకెవరు..ఇప్పటికే ప్రభాస్‌తో సలార్ వంటి సినిమాను తెరకెక్కిస్తోన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇప్పటికే కె.జి.యఫ్ చాప్టర్ 1తో పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్‌గా క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్..కె.జి.యఫ్ చాప్టర్ 2ను విడుదలకు సిద్ధం చేశాడు. మరో వైపు ప్రభాస్‌తో సలార్ సినిమాను చకచకా పూర్తి చేసేస్తున్నాడు. ప్రభాస్‌కున్న ఇమేజ్ దృష్ట్యా ప్యాన్ ఇండియా డైరెక్టర్.. అది కూడా ఇటు మన దక్షిణాది, అటు ఉత్తరాది సినీ ప్రేక్షకుల పల్స్ తెలిసిన దర్శకుడు ఉంటే బావుంటుందని భావించిన నిర్మాత దిల్‌రాజు ఆయన్నే దర్శకుడిగా ఒప్పించాడు. ఈ ఏడాది అక్టోబర్ 23న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ తన 20వ చిత్రం రాధేశ్యామ్ షూటింగ్‌ను పూర్తి చేసేయడమే కాకుండా సలార్, ఆదిపురుష్ సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఇది కాకుండా నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంది. వీటితో పాటు త్వరలోనే ప్రభాస్ 24 ఏంటనే దానిపై కూడా క్లారిటీ రానుందట. అయితే ఏడాది రెండు సినిమాలతో అభిమానులను ఆనందింప చేయాలని ప్లాన్ చేసుకుని అందుకు తగినట్లు సినిమాలను ట్రాక్ ఎక్కించే పనిలో ఉన్నారు.
By September 18, 2021 at 07:14AM
No comments