Naga Chaitanya on Divorce: నేనైతే పెద్దగా పట్టించుకోను.. కానీ చాలా బాధేసింది.. ఎట్టకేలకు నాగ చైతన్య ఓపెన్
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒక్కటే టాపిక్.. అదే నాగ చైతన్య- విడాకుల ఇష్యూ. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ సెలబ్రిటీ జోడీ కొన్ని కారణాల వల్ల విడిపోతున్నారనే వార్తలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. చైతూ లేకుండా సమంత ఒంటరిగా టూర్స్ వేస్తుండటం, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న కొటేషన్స్ జనాల్లో పలు అనుమానాలు లేవనెత్తాయి. మరోవైపు ఈ ఇష్యూపై ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉంటూ వచ్చిన .. ఎట్టకేలకు నోరు విప్పారు. నాగ చైతన్య హీరోగా రూపొందిన 'లవ్ స్టోరీ' సినిమా నేడు (సెప్టెంబర్ 24) ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాగ చైతన్య.. తన ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలపై ఓపెన్ అయ్యారు. ఈ మేరకు తన వివాహబంధంపై వస్తున్న రూమర్స్‌పై రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా ప్రభావం తనపై పెద్దగా ఉండదని, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తలకు పెద్దగా పట్టించుకోనని చెప్పారు నాగ చైతన్య. ఈ రోజుల్లో మీడియా కవరేజ్ విషయంలో చాలా మార్పులు చూస్తున్నామని చైతూ అన్నారు. ఒకప్పుడు మ్యాగజైన్స్ ఉండేవి.. కానీ నేను డిజిటల్ మీడియా వచ్చి వేగంగా వార్తలు రీప్లేస్ అవుతున్నాయని పేర్కొన్నారు. అందుకే ఎన్ని అవాస్తవాలు ప్రచారంలోకి వచ్చినా వాస్తవాలు మాత్రమే ప్రజలు గుర్తుంచుకుంటారని అన్నారు నాగ చైతన్య. ఇకపోతే లాక్‌డౌన్ తర్వాత తన జీవితంలో, ఆలోచనల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయని చెప్పిన అక్కినేని వారబ్బాయి.. తన పర్సనల్ లైఫ్ గురించి మీడియా అతిగా చర్చించడం, కవరేజ్ చేయడం చాలా బాధగా అనిపించిందని అన్నారు. తొలుత ఇబ్బందిగా ఫీలైనా.. రాను రాను అలాంటి వాటిని పట్టించుకోవడం మానేశానని నాగ చైతన్య తెలిపారు. డైవర్స్‌పై వస్తున్న వార్తలపై చైతూ ఇచ్చిన ఈ రియాక్షన్ అక్కినేని అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది. కాకపోతే ఫుల్ క్లారిటీ అయితే రాలేదు.
By September 24, 2021 at 09:29AM
No comments