Manchu Mohan Babu: కులం, ప్రాంతం కారణంగా అవమానాలు ఎదుర్కొన్నా.. అందుకే దాన్ని తీసేశా: మోహన్ బాబు
తెలుగు సినీ చరిత్రలో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కామెడీ పాత్రలు చేసి ప్రేక్షకులను నవ్వించినా, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను మనసులను దోచుకున్నా.. అది ఆయనకే చెల్లింది. ఆయనే కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌బాబు. 560కి పైగా చిత్రాల్లో నటుడిగా, నిర్మాతగా మెప్పించిన ఆయన కెరీర్ ప్రారంభంలో కులం, ప్రాంతం అనే కారణాలతో అవమానాలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. అయితే దాన్ని ఆయన ఎలా అధిగమించి ఎదిగాననే విషయాలను కూడా వివరించారు. ‘‘నటుడు కాకముందు మోహన్‌బాబు, రూ.140కు డ్రిల్ మాస్టర్‌గా ఓ స్కూల్‌లో జాయిన్ అయ్యాను. ఏడాదిపాటు పనిచేశారు. అయితే స్కూల్‌ను నిర్వహణలో ప్రధానంగా వ్యవహరించిన ఓ గ్రూపుకు చెందిన కులం వాడిని కాకపోవడంతో నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. అది నాకెంతో బాధగా అనిపించింది. కులం అనేది అడ్డంకి కాకూడదని భావించి నేను విద్యానికేతన్ స్కూల్‌ను ప్రారంభించిన సమయంలో నా స్కూల్ ఆడ్మిషన్ ఫామ్‌లో కులం అనే కాలమ్‌ను తీసేశాను. అలా విద్యారంగంలో కులం అనే కాలమ్‌ను తీసేసిన మొదటి వ్యక్తిని ఇండియాలోనే నేను’’ అని తెలిపారు మోహన్ బాబు. అలాగే డైలాగ్ డెలివరీలో మోహన్‌బాబుకు ఓ సపరేట్ స్టైల్ ఉంటుంది. ఆయన డిక్షన్ చాలా డిఫరెంట్. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. అలాంటి డిఫరెంట్ స్టైల్‌ను మీరెలా నేర్చుకున్నారు అని అలీ అడిగిన ప్రశ్నకు మోహన్‌బాబు సమాధానం చెబుతూ తాను ప్రాంతం కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులను తెలియజేశారు. ‘‘వేషాలను అడుక్కోవడానికి నిర్మాతలు, దర్శకుల దగ్గరకు వెళ్లినప్పుడు, నువ్వు రాయలసీమవాడివి కదా! నీకు భాష ఏం తెలుసు? అన్నారు. దాంతో నేను స్వయంగా పట్టుబట్టి డిక్షన్ నేర్చుకున్నాను. అన్నగారు(సీనియర్ ఎన్టీఆర్) సినిమాలు చూసి, కొన్ని చదువుకుని, భాష తెలుసని చెప్పాను. కసి, పట్టుదల, దీక్షతో ఇవి నేర్చుకున్నాను’’ అని తెలిపారు మోహన్‌బాబు. ఈ విషయాలను రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఆలీకి సరదాగా వివరించారు మోహన్‌బాబు.
By September 28, 2021 at 08:32AM
No comments