Breaking News

MAA: జీవితపై గురిపెట్టిన థర్టీ ఇయర్స్ పృథ్వీ రాజ్! ఆమె చేసే పనులివే అంటూ సంచలన వ్యాఖ్యలు


టాలీవుడ్‌లో ఎప్పటిలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ () ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అధ్యక్ష బరిలో ఉన్న పోటీదారులు తమ తమ వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఈ సారి పోటీలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, సీవీఎల్ నరసింహా రావు ఉండగా.. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య పోటీ బలంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులను ప్రకటించి రంగంలోకి దూకగా, నిన్న (సెప్టెంబర్ 23) మంచు విష్ణు తన ప్యానల్ వివరాలు తెలిపారు. ఈ నేపథ్యంలో జీవితపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. మంచు విష్ణు ప్యానల్‌లో జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబు మోహన్‌ వ్యవహరిస్తుండగా.. వైస్ ప్రెసిడెంట్స్‌గా మాదాల రవి, పృథ్వి రాజ్, ట్రెజరర్‌గా శివ బాలాజీ, జాయింట్ సెక్రటరీస్‌గా కరాటే కళ్యాణి, గౌతమ్ రాజు ఉన్నారు. ఇక ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా అర్చన, అశోక్ కుమార్, గీతాసింగ్, హరనాథ్ బాబు, జయవాణి, మలక్ పేట శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరి రెడ్డి, రేఖ, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివన్నారాయణ, శ్రీలక్ష్మి, పి.శ్రీనివాసులు, స్వప్న మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల ఉన్నారు. అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ మెంబర్‌గా ఉన్న ఓటర్లను ప్రలోభపెడుతోందంటూ మంచు విష్ణు ప్యానెల్ మెంబర్ పృథ్వీ రాజ్ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. ఎన్నికల సంఘానికి లేఖ రాసిన పృథ్వి రాజ్.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యురాలైన జీవిత రాజశేఖర్ ఓటర్లను ప్రభావితం చేసేలా చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. టెంపరరీ ఐడీ కార్డులు ఇప్పిస్తానంటూ జీవిత హామీ ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే ఆమెపై విచారణ చేపట్టి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ ఆఫీసర్‌ని కోరారు.


By September 24, 2021 at 08:01AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/maa-elections-30-years-prudhvi-raj-shocking-comments-on-jeevitha/articleshow/86470107.cms

No comments