Love Story - Collections: ‘వకీల్‌సాబ్’కు షాకిచ్చి రికార్డ్ క్రియేట్ చేసిన ‘లవ్‌స్టోరి’... ఓవర్‌సీస్ కలెక్షన్స్?
కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత సినిమా థియేటర్స్‌కు రావడానికి ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు. చాలా సినిమాలు వచ్చాయి. ప్రేక్షకులు కూడా థియేటర్స్‌కు వచ్చారు. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం రాలేదు. రీసెంట్‌గా విడుదలైన సీటీమార్‌ను ప్రేక్షకులు బాగా ఆదరించారు. తొలిరోజు ఆ సినిమా రికార్డ్ కలెక్షన్స్‌ను సాధించడమే అందుకు ఉదాహరణ. అయితే నాగచైతన్య చేసిన లవ్‌స్టోరి మంచి బజ్ క్రియేట్ చేయడమే కాదు, ప్రేక్షకులను థియేటర్స్ వైపు అడుగులేయించడంలోనూ సక్సెస్ అయ్యింది. శుక్రవారం(సెప్టెంబర్ 24) థియేటర్స్ కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఏ సినిమాకు లేనంతగా ప్రేక్షకులు వచ్చారు. అడ్వాన్స్ బుకింగ్స్‌తో లవ్‌స్టోరి సినిమా చూడటానికి ఆడియెన్స్ ఆసక్తి చూపించారు. తెలుగు రాష్ట్రాలే కాదు, ఓవర్‌సీస్‌లోనూ ఈ సినిమాకు చాలా మంచి ఆదరణ లభించింది. ప్రీమియర్ షోలకు కూడా ప్రేక్షకులు అమెరికాలో క్యూ కట్టడం విశేషం. అమెరికాలో 224 లొకేషన్స్‌లో లవ్‌స్టోరి ప్రీమియర్స్ వేస్తే, 3,07,103 డాలర్స్ వచ్చాయి. ఇక తొలిరోజు 144 లొకేషన్స్‌లో సినిమా 85,232 డాలర్స్ వసూళ్లను సాధించింది. మొత్తంగా 3,92, 335 డాలర్స్ ఈ సినిమాకు వచ్చింది. అంటే మొత్తంగా రూ.2.9 కోట్ల రూపాయలు వచ్చాయి. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత అసలు ఓవర్‌సీస్‌లో సినిమాలు ఆడటం లేదు అని భావించే దర్శక నిర్మాతలకు ఇదొక ధైర్యాన్నిచ్చిందనే చెప్పాలి. వకీల్‌సాబ్ ప్రీమియర్స్‌కు వచ్చిన కలెక్షన్స్‌ను లవ్‌స్టోరి క్రాస్ చేసింది. కోవిడ్ సమయంలో విడుదలైన చిత్రాల్లో ఈ రకమైన కలెక్షన్స్ రావడమనేది ఓ రికార్డ్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వం, ఫిదా కాంబినేషన్(శేఖర్ కమ్ముల, సాయి పల్లవి) రిపీట్ కావడం.. సారంగ దరియా సహా పాటలన్నీ హిట్ కావడంతో సినిమాపై మేకర్స్ ఊహించిన దానికంటే ఎక్కువ బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగినట్లే కలెక్షన్స్ వస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
By September 25, 2021 at 07:06AM
No comments