Breaking News

ప్రముఖ స్వామీజీ, అఖాడా పరిషత్ అధ్యక్షుడు నరేంద్ర గిరి ఆత్మహత్య


ప్రముఖ స్వామీజీ, అధ్యక్షుడు స్వామీ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌‌లో ఆయన ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం తన నివాసంలోనే ఆయన చనిపోయినట్టు గుర్తించారు. దేశంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థల్లో అఖిల భారతీయ అఖాడా పరిషత్ ఒకటి. ప్రాథమిక దర్యాప్తులో స్వామీజీ రాసిన సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు వెల్లడించారు. తాను మరణించిన తర్వాత ఆశ్రమాన్ని ఎలా నడిపించాలో నరేంద్ర గిరి స్వామీజీ అందులో పేర్కొన్నారు. ‘మేము సూసైడ్ నోట్ చదివాం.. ఆయన చాలా ఆందోళన చెందినట్టు తెలిపారు.. స్వామీజీ మరణం తర్వాత ఆశ్రమంలో ఏమి చేయాలో కూడా వీలునామా రూపంలో రాశారు’ అని సీనియర్ పోలీస్ అధికారి కేపీ సింగ్ చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు. ఈ కేసులో నరేంద్ర గిరి స్వామి శిష్యుడు ఆనంద్ గిరిని హరిద్వార్‌లో అరెస్ట్ చేశారు. స్వామీజీ ఆత్మహత్య ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సహ ఇతర ప్రముఖ రాజకీయ నేతలు ట్విట్టర్ ద్వారా తమ సంతాపం తెలియజేశారు. ‘అఖాడా పరిషత్ అధ్యక్షుడు శ్రీ నరేంద్ర గిరి స్వామీజీ మరణం చాలా విచారకరం.. ఆధ్యాత్మిక సంప్రదాయాలకు అంకితమైనప్పటికీ సమాజంలో అనేక సమూహాలను కలపడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ భగవంతుడు ఆయనకు తన పాదాల చెంత చోటు కల్పిస్తాడు.. ఓం శాంతి’ అని ప్రధాని ట్వీట్ చేశారు. ‘అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి మరణం ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటు.. ఆయన ఆత్మకు భగవంతుని పాదాల దగ్గర స్థానం కల్పించాలని, ఆయన లేని బాధను తట్టుకునే శక్తిని తన అనుచరులకు ఇవ్వాలని రాముడిని ప్రార్థిస్తున్నాను’ అని యూపీ సీఎం యోగి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇక, యూపీ కాంగ్రెస్ విభాగం, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు సంతాపం తెలిపారు. నరేంద్ర గిరి అత్యంత ప్రభావవంతమైన ఆధ్యాత్మిక గురువు. అన్ని వర్గాల రాజకీయ నాయకులు ప్రయాగరాజ్‌లో ఆయనను కలిసేవారు.


By September 21, 2021 at 07:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/akhil-bharatiya-akhada-parishad-president-narendra-giri-dies-by-suicide/articleshow/86385702.cms

No comments