Breaking News

సౌందర్య అంటే ఎంతో ఇష్టం.. ఎప్పటికీ అదే నా కోరిక.. మనసులోమాట చెప్పిన రష్మిక మందన


ఏ రంగంలో ఉన్న వారికి ఆ రంగంలో వెళ్లే దారి, చేసే పనులపై ఓ దూర దృష్టి అనేది ఉంటుంది. అలాగే కొన్ని కోరికలు కూడా ఉంటాయి. హీరోయిన్ కూడా అదే చెబుతోంది. ప్రస్తుతం సినీ రంగంలో రాణిస్తున్న ఆమె.. తనకు ఓ కల అనేది ఉందని, అది నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తానని అంటోంది. మరి అదేంటో ఓ లుక్కేద్దామా.. ఒకానొక సమయంలో సౌత్ ఇండియా ఆడియన్స్ మనసు దోచుకొని స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది అందాల తార సౌందర్య. అగ్ర హీరోలకు బెటర్ చాయిస్ అవుతూ బిజీ బిజీగా వరుస సినిమాలు చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో దశాబ్ద కాలంపాటు హవా నడిపించిన ఆమె, దురదృష్టవశాత్తు ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. అయితే అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమె బయోపిక్‌లో నటించాలనేది తన కోరిక అంటూ మనసులోమాట బయటపెట్టింది రష్మిక మందన. చిన్నప్పుడు తనను కుటుంబ సభ్యులంతా సౌందర్యలా ఉంటావని అనేవారని, అలా తనకు సౌందర్య ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోయిందని రష్మిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది కాబట్టి.. అవకాశం వస్తే సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఉందని చెప్పింది. మరోవైపు ఆడియన్స్ కూడా సౌందర్య బయోపిక్ వస్తే బాగుంటుందని, అలాగైనా మరోసారి ఆమెను వెండితెరపై చూడొచ్చని భావిస్తున్నారు. తెలుగుతో పాటు ప్రస్తుతం పలు భాషల్లో బిజీగా ఉంది రష్మిక మందన. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో పల్లెటూరి పిల్లలా రష్మిక కనిపించనుందని, ఆమె నటన సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానుందని అంటున్నారు.


By September 17, 2021 at 07:06AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/soundarya-bipoic-rashmika-mandanna-open-comments-on-her-dream/articleshow/86280695.cms

No comments