Breaking News

ఆరో తరగతి విద్యార్ధి బ్యాంకు ఖాతాకు రూ.900 కోట్లు జమ.. అసలు విషయం తెలిసి షాక్!


స్కూలు యూనిఫాం, విద్యార్థులకు అవసరమైన వస్తువులు కొనుక్కోవడానికి బిహార్ ప్రభుత్వం ఓ పథకం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు విద్యార్థులు ఈ పథకం కోసం ఇద్దరు విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. అనూహ్యంగా వారి ఖాతాల్లో వందల కోట్ల రూపాయలు జమయ్యాయి. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు తమకు కూడా అలాంటి అదృష్టం వరించిందేమోనని ఏటీఎం ముందు బారులు తీరారు. ఈ సంఘటన బిహార్‌లోని కతియార్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసిన విద్యార్థులు.. ఆ డబ్బులు తమ ఖాతాకు జమయ్యాయో? లేదో తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌ కేంద్రానికి వెళ్లి చెక్ చేసుకున్నారు. ఆ సమయంలో ఆరో తరగతి చదువుతోన్న ఆశిశ్‌ అనే విద్యార్ధి ఖాతాలో రూ.6.2 కోట్లు, గురు చరణ్ విశ్వాస్ ఖాతాకు రూ.900 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయం ఊరంతా పాకింది. దీంతో తమ ఖాతాల్లో కూడా అలాంటి అద్బుతం జరిగిందేమోనని గ్రామస్థులు ఏటీఎంల వద్దకు బారులు తీరారు. ఉత్తర బిహార్ గ్రామీణ బ్యాంకులోనే ఆశిష్, విశ్వాస్‌లకు అకౌంట్లు ఉన్నాయి. ఈ విషయంపై బ్యాంకు సిబ్బంది స్పందిస్తూ సాంకేతికలోపంతోనే అలా జరిగిందని తెలిపారు. దీనిపై కతియార్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదు జమ అయిందనే సమాచారం అందింది. ఉత్తర బిహార్ గ్రామీణ బ్యాంకు శాఖలో ఖాతాలను పరిశీలించాం.. సాంకేతిక సమస్య వల్లే ఆ ఖాతాల్లో డబ్బు ఉన్నట్లు చూపిందని మేనేజర్ తెలిపారు. వాస్తవానికి ఖాతాల్లో ఆ డబ్బు లేదు. దీనిపై బ్యాంకు నుంచి నివేదిక తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. అయితే, కాగా, బిహార్‌లో ఈ విధంగా జరగడం ఇదే తొలిసారి కాదు. పట్నా పరిసరాల్లో నివసించే ఒక వ్యక్తి ఖాతాలో ఈ ఏడాది మార్చిలో రూ.5 లక్షలు జమయ్యాయి. ఖాగడియా జిల్లా భక్తియార్‌పుర్ గ్రామానికి చెందిన రంజిత్ దాస్‌కు చెందిన బ్యాంకు ఖాతాలో రూ.5.5లక్షలు జమయ్యాయి. దీంతో ఆ సొమ్మును రంజిత్ డ్రా చేసి వాడేసుకున్నారు. బ్యాంకు అధికారులు ఆ డబ్బును రికవరీ చేసేందుకు ప్రయత్నించగా..ఆ వ్యక్తి నిరాకరించారు. దాంతో జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది.


By September 17, 2021 at 06:57AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/over-900-crore-credited-into-two-school-boys-bank-accounts-in-bihar/articleshow/86280580.cms

No comments