Breaking News

భీమ్లా నాయక్ రికార్డుల మోత.. విడుదలకు ముందే హంగామా! అరుదైన ఫీట్ సాధించిన ఫస్ట్ సాంగ్


పవన్ కళ్యాణ్ రీ- ఎంట్రీ ఇచ్చారు.. పవర్ స్టార్ అభిమానులు రికార్డుల మోత మోగిస్తున్నారు. ఇది అందరూ ఊహించిందే అయినా.. అంతకుమించి అన్నట్లుగా పవర్ స్టార్ దూసుకుపోతుండటం, గత రికార్డులను చెరిపేస్తూ తన పేరిట సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ మోత మోగిస్తుండటం మెగా శిభిరంలో నూతనోత్సాహం నింపుతోంది. 'వకీల్ సాబ్' మూవీతో రీ- ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ దుమ్ముదులిపిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు '' సినిమా చేస్తూ విడుదలకు ముందే రికార్డుల సునామీ సృష్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేసిన ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తూ రికార్డుల మోత మోగిస్తోంది. తాజాగా ఈ పాట అరుదైన ఫీట్ సాధించింది. టాలీవుడ్‌లో అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్ సాధించిన పాటగా ఈ సాంగ్ రికార్డు నెలకొల్పింది. ఈ విషయాన్ని తెలిపిన చిత్ర నిర్మాణ సంస్థ.. 'భీమ్లా నాయక్' నుంచి మరో పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసి పవన్ అభిమానులను హుషారెత్తించింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ తొలుత మిశ్రమ స్పందన తెచ్చుకున్నా.. క్రమంగా ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. మొగులయ్య, జోసెఫ్, థమన్, శ్రీకృష్ణ, పృథ్వీచంద్ర, రామ్ మిరియాల ఆలపించిన తీరు శ్రోతలను కట్టిపడేస్తోంది. దీంతో యూట్యూబ్ వ్యూస్ పరంగా ఈ సాంగ్ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' తెలుగు రీమేక్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు స్క్రీన్ ప్లే- సంభాషణలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తుండగా.. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్ బాణీలు కడుతున్నారు. రానున్న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.


By September 07, 2021 at 07:47AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bheemla-nayak-title-song-record-fastest-1-million-liked-telugu-song-ever/articleshow/85996264.cms

No comments